త్రివిక్రమ్‌కి లేని ఆ అదృష్టం.. అందుకే మరో రాజమౌళి కాలేకపోతున్నాడా??

ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలతో అందరిని మాయ చేసేస్తుంటాడు. ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఆయన సినిమాలోని డైలాగ్స్ సినీ ప్రేమికులకు గుర్తుంటాయి. ఇక త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అతడు, అల వైకుంఠపురములో, జులాయి లాంటి ఎన్నో సినిమాలు ప్రేక్షకులను ఆయనకు ఎంతో దగ్గరయ్యేలా చేసాయి. రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి సినిమా లాంటి హిట్‌ను త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అల వైకుంఠపురములో సినిమా అందుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి తరువాత టాప్ డైరెక్టర్ అంటే చాలా మంది త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరే చెబుతారు.

అయితే త్రివిక్రమ్ సినిమా కేవలం టాలీవుడ్ వరకే హిట్ అవుతుంటాయి. ఆయన మ్యాజిక్ పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన కొన్ని సినిమాలు వేరే భాషలో విడుదల అయ్యి ఫ్లాప్ అయ్యాయి. ‘నవ్వు నాకు నచ్చావ్ ‘ కోలీవుడ్‌లో వసికరా పేరుతో రిలీజైంది. ‘అతడు ‘ సినిమా హిందీలో ‘ఏక్ ది పవర్ ఆఫ్ వన్’ పేరుతో తెరకెక్కింది. అలానే జులాయి, అత్తారింటికి దారేది సినిమాలు కోలీవుడ్‌లో సగసాం, వంతన్ రాజతాన్ వరువెన్ పేర్లతో రీమేక్ అయ్యాయి. కానీ వీటిలో ఏ ఒక్కటి కూడా హిట్ కాలేదు.

అందుకు కారణం త్రివిక్రమ్ సినిమాలో స్టోరీ రొటీన్‌గా ఉండటమని కొంతమంది అంటున్నారు. మాటలతోనే ప్రేక్షకులకు ఆకట్టుకొని తెలుగులో సక్సెస్ కావడం నిజం కానీ ఇతర భాషల్లో అది అబద్దం అని అంటున్నారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రిన్స్ మహేష్ బాబు మూవీ తెలుగువారితో సహా ఇతర భాషల వారిని ఆకట్టుకుంటుందా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న మరో సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతుందో లేదో చూడాలి.