తమిళ్ కమెడియన్ ఆఖరి కోరిక తీర్చబోతున్న సూపర్ స్టార్..!

ప్రస్తుత కాలంలో చాలామంది తమ ఆఖరి కోరికలు నెరవేరుకుండానే మరణిస్తూ ఉండడం నిజంగా మనసును కలచి వేస్తోంది. ఈ క్రమంలోనే నిన్నటికి నిన్న తన ఆఖరి కోరిక తీరకుండానే తారకరత్న స్వర్గస్తులయ్యారు. ఆయన మరణం మరువకముందే ఇప్పుడు మరొక తమిళ్ కమెడియన్ తన ఆఖరి కోరిక కై ఎంతో శ్రమించి ఆ కోరిక తీరకుండానే మరణించడం నిజంగా బాధాకరమని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆయన ఆఖరి కోరికను తీర్చడానికి రజనీకాంత్ ముందుకు వచ్చినట్లు సమాచారం.

Rajinikanth Gets Emotional For Doing THIS To Mayilsamy: Says 'I Thought Of  Apologizing.. But Couldn't..' - Filmibeat

కోలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న రజనీకాంత్.. తాజాగా తన స్నేహితుడు , తమిళ్ స్టార్ కమెడియన్ మాయిల్ సామి ఆఖరి కోరికను తాను తీరుస్తున్నానని ప్రకటించారు.. ఈ నేపథ్యంలోని రజనీకాంత్ మాట్లాడుతూ.. మాయిల్ శివ భక్తుడు.. ప్రతి ఏడాది కార్తిక పౌర్ణమి రోజున తిరువన్నామలై వెళ్లేవాడు.. శివ ధ్యానంలో చాలా సంతోషించేవాడు.. ఆరోజు అక్కడికి వెళ్దామని చెప్పేవాడు.. ఒకసారి కొన్ని నెలల క్రితం నాకు ఫోన్ కూడా చేశాడు. కానీ నేను పనిలో బిజీగా ఉండి తీయలేదు.. కానీ ఇప్పుడు మాట్లాడదామన్నా.. మాయిల్ లేకుండా పోయాడు. అంతేకాదు పరమశివ భక్తుడైన మాయిల్ శివరాత్రి రోజే చనిపోయాడు.. అది దేవుడి నిర్ణయం.. దేవుడి ప్రియ భక్తుడు కాబట్టి తన దగ్గరికే తీసుకువెళ్లిపోయాడు అంటూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు సూపర్ స్టార్.

மயில்சாமி நடித்த ரஜினியின் 2 படங்கள்.. கடைசி வரை நிறைவேறாமல் போன மற்றுமொரு  ஆசை - Cinemapettai

అంతేకాదు మాయిల్ చివరి కోరిక నేను తిరువన్నామలై గుడిని దర్శించాలని.. నేను అక్కడికి వెళ్తే చూడాలని ఆయన అనుకున్నారు.. ఇదే విషయాన్ని డ్రమ్స్ శివమణికి కూడా చెప్పారు.. నేను శివమణితో మాట్లాడతాను .. మాయిల్ సామి చివరి కోరికను తీరుస్తాను అంటూ రజనీకాంత్ తెలిపారు. మొత్తానికి అయితే తన స్నేహితుడి ఆఖరి కోరిక తీర్చబోతున్నందుకు రజనీకాంత్, మాయిల్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest