ఇంత సీక్రెట్‌గానా… జబ‌ర్ద‌స్త్ రాకేష్‌.. సుజాత ప్రేమ క్లైమాక్స్‌లో పెద్ద ట్విస్ట్‌…!

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన కమెడియన్లలో జబర్దస్త్ రాకింగ్ రాకేష్ కూడా ఒకరు. గతం లో చిన్నపిల్లలతో కలిసి స్కిట్లు చేసిన్ రాకేష్.. ఆ తర్వాత పలు జబర్దస్త్ కమెడియన్లతో స్కిట్లు చేయడం మొదలుపెట్టారు . అలా మంచి మంచి కామెడీ స్కిట్స్ తో ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత ఊహించని రేంజ్ లో పాపులారిటీ సంపాదించారు రాకేష్. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఇమేజ్తో సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకొని అక్కడ కూడా కమెడియన్ గా పనిచేశారు రాకేష్. ఇక న్యూస్ రిప్రెసెంటర్ గా చేస్తున్న జోర్దార్ సుజాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అలా వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైందని చెప్పవచ్చు.

అయితే మొదట కొన్ని స్కిట్లలో వీరిద్దరి మధ్య మల్లెమాల సంస్థ ఏదో ఉన్నట్టు చూపించినా మొదట ఎవరు నమ్మలేదు. కానీ సుజాత, రాకేష్ ఇద్దరు కూడా తమ ప్రేమించుకుంటున్నాము అనే విషయంపై క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఈ విషయాన్ని నమ్మారు. గత కొద్దిరోజులుగా వీరు వివాహం చేసుకోబోతున్నారనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. గడచిన కొద్ది రోజుల క్రితం వీరి ఎంగేజ్మెంట్ కూడా చాలా ఘనంగా జరిగింది. అయితే సడన్గా ఈరోజు ఉదయం వీరిద్దరూ వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అది కూడా తిరుపతిలో చేసుకున్నట్లు సమాచారం . అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

ఇక వీరి పెళ్లికి గెటప్ శ్రీను తన భార్యతో కూడా హాజరైనట్టుగా ఈ ఫోటోలను కనిపిస్తోంది. ఇక వీరి బంధుమిత్రుల సమక్షంలో కూడా ఈ వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది. మొన్నటి వరకు ప్రేమించుకుని ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట పెళ్లి ఎప్పుడో డేట్ ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు కానీ ఎవరు ఊహించని విధంగా తమ ప్రేమాయణం క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇస్తూ తిరుపతిలో ఈరోజు ఉదయం పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది ఈ జంట మొత్తానికైతే అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Loveco (@celebritycouple.insta)

Share post:

Latest