నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న సంయుక్త మీనన్.. నిలదొక్కుకోగలదా..?

ప్రస్తుతం భీమ్లా నాయక్, బింబిసారా, సార్ సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్న మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ను భారీగా డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఈమె అంత అద్భుతమైన నటి కాకపోయినా సరే ఈమెకు మాత్రం వరుసగా కొత్త ఆఫర్లు అయితే చాలా వస్తున్నాయి. టాలీవుడ్ నిర్మాతలు కూడా సంయుక్తమీనన్ కు అవకాశాలు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం గమనార్హం అయితే వరుస విజయాల నేపథ్యంలో ఈమె పారితోషకం పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది..

30+ Gorgeous Photos Of Samyuktha Menon - Filmi Tamasha | Pretty girls  selfies, Actress bikini images, Most beautiful indian actress

అంతేకాదు కథ నచ్చితే సెకండ్ హీరోయిన్ రోల్స్ లో నటించడానికి కూడా సంయుక్త ఆసక్తి చూపిస్తుందన్న వార్తలు ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి. సార్ సినిమాలో టీచర్ రోల్ ను అద్భుతంగా పోషించి మెప్పించిన ఈమె ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్టుకు 70 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల రేంజ్ లో డిమాండ్ చేస్తోందని సమాచారం. అంతేకాదు కథ నచ్చితే గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా వెనకాడడం లేదట. ఇప్పటివరకు అభినయ ప్రధాన పాత్రలో మాత్రమే నటించి మెప్పించడం గమనార్హం. సంయుక్త మీనన్ ఇప్పుడు తమిళంలో బూమరాంగ్ అనే సినిమాలో నటిస్తోంది.

తెలుగు స్టార్ హీరోలకు జోడిగా సంయుక్తకు అవకాశం దక్కితే ఆమె కెరియర్ మరింత పుంజుకుంటుందని చెప్పవచ్చు. కానీ ఇప్పుడే వరుస హ్యాట్రిక్ విజయాలతో డిమాండ్ బాగా పెంచేసి నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది. ఒకవేళ ఈ అమ్మడు ప్రతి సినిమాకు తన పారితోషకాన్ని పెంచుకుంటూ పోతే తెలుగులో అవకాశాలు వస్తాయా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయం తెలిసి మొదట్లోనే ఇంత డిమాండ్ చేస్తే ఈమె తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలదా అన్న అనుమానాలు కూడా నేటిజెన్ల నుండి వ్యక్తం అవుతున్నాయి. అందుకే సంయుక్త ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులను ఎంచుకోవడంపై చాలా దృష్టి పెడుతున్నారు. మరోవైపు త్రివిక్రమ్ కూడా ఈమె కెరియర్ కు హెల్ప్ చేస్తున్నారని సమాచారం.

Share post:

Latest