స‌మంత‌కు గాయాలు.. ఆ పిక్ చూసి తెగ హైరానా ప‌డిపోతున్న అభిమానులు!

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ స‌మంత గాయాల‌పాలైంది. మయోసైటిస్ వంటి అరుదైన వ్యాధి నుంచి కోలుకున్న సమంత.. ఇటీవ‌ల `సిటాడెల్` అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ షూటింగ్ లో జాయిన్ అయింది. దర్శక ద్వయం రాజ్, డికే రూపొందిస్తున్న ఈ సిరీస్ లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సమంత ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోసిస్తున్నారు.

ఇందులో స్టైలిష్ పోలీస్ ఆఫీస‌ర్ గా స‌మంత క‌నిపించ‌బోతోంది. అయితే ఆమె పలు యాక్షన్ సన్నీవేశాల్లో నటించాల్సి ఉంది. దీని కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ దగ్గర ప్రత్యేకంగా ట్రెనింగ్ తీసుకుంది. అలాగే జిమ్ లో, ట్రైయినర్ తో ఎంతలా కష్టపడుతుందో ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తూనే ఉంది. అయితే తాజాగా షూటింగ్‌లో భాగంగా ఓ స్టంట్‌ సీన్‌ కోసం రిహార్సల్స్‌ చేస్తుండగా సామ్ చేతుల‌కు గాయాలయ్యాయి.

తన రెండు చేతులకు గాయాలైనట్లు ఫోటోని షేర్ చేసిన సమంత ‘పర్క్స్ ఆఫ్ యాక్షన్’ అంటూ కామెంట్ పెట్టింది. ఈ పిక్ చూసి అభిమానులు తెగ హైరానా ప‌డిపోతున్నారు. స‌మంత రెండు చేతులు రక్తంతో, దెబ్బలతో ఉండటంతో ఫ్యాన్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. ఆరోగ్యం ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాలంటూ స‌మంత‌కు సూచ‌న‌లు చేస్తున్నారు. మ‌రోవైపు వ‌ర్క్ ప‌ట్ల స‌మంత‌కు ఉన్న డెడికేష‌న్ చూసి నెటిజ‌న్లు ఫిదా అయిపోతున్నారు.

Share post:

Latest