ప్రియ‌మైన వ్య‌క్తి నుంచి స‌ర్ ప్రైజ్‌.. తెగ సంబర‌ప‌డిపోతున్న స‌మంత‌!

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత కొద్ది నెల‌ల క్రితం భ‌ర్త‌ నాగచైతన్య నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్న ఆమె.. తన పూర్తి ఫోక‌స్ ను సినిమాలపైనే పెట్టింది. ఓవైపు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో పోరాడుతూనే.. మరోవైపు షూటింగ్స్ లో పాల్గొంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా సమంతకు ప్రియమైన వ్యక్తి నుంచి స‌ర్ ప్రైజ్ వచ్చింది. అది చూసి సమంత తెర‌ సంబరపడిపోయింది.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సమంతను తన క్లోజ్ ఫ్రెండ్ ప్రియాంక దుగ్గి సర్ ప్రైజ్ చేసింది. స‌మంత కోసం అంద‌మైన రోజ్ ఫ్లవర్స్ పంపించి విష్ చేసింది. అలాగే ఓ మంచి గిఫ్ట్ కూడా పంపించింది. దీంతో తన ఫ్రెండ్ కు థ్యాంక్స్ చెబుతూ సామ్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ప్రియాంక ఇచ్చిన స‌ర్‌ప్రైజ్ కు తాను చాాలా ఖుషీ అయ్యాయ‌ని స‌మంత తెలిపింది.

కాగా, మ‌యోసైటిస్ కార‌ణంగా కొన్నాళ్ల‌తో సినిమాల‌తో పాటు స‌మంత సోష‌ల్ మీడియాకు కూడా దూర‌మైంది. అయితే ఇప్పుడిప్పుడి ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్న ఈ బ్యూటీ.. మ‌ళ్లీ సోయాల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక పోస్ట్ తో అభిమానుల‌కు చేర‌వ‌వుతోంది. ముఖ్యంగా జిమ్ లో క‌స‌ర‌త్తులు చేస్తున్న ఫోటోల‌ను త‌ర‌చూ పంచుకుంటోంది. సినిమాల విష‌యానికి వస్తే.. ఈమె న‌టించిన శాకుంతలం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఖుషి మూవీ సెట్స్ మీద ఉంది. మ‌రోవైపు బాలీవుడ్ లో తెర‌కెక్కుతోన్న ఓ వెబ్ సిరీస్ షూటింగ్ లో స‌మంత పాల్గొంటోంది.

Share post:

Latest