ఆ హీరోయిన్ నా ఫ‌స్ట్ క్ర‌ష్‌.. టాప్ సీక్రెట్ లీక్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తాజాగా హీరోయిన్స్ లో త‌న ఫ‌స్ట్ క్ర‌ష్ ఎవ‌రు అనే టాప్ సీక్రెట్ ను తొలిసారి లీక్ చేశాడు. `ఆర్ఆర్ఆర్‌` సినిమా ప్ర‌స్తుతం ఆస్క‌ర్ కు ఒక్క అడుగు దూరంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే రామ్ చ‌ర‌ణ్ వ‌రుస‌గా హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇందులో భాగంగానే రీసెంట్ గా ఓ ఇంటర్నేషనల్ మీడియాకు ఆన్ లైన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు చరణ్.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకున్నాడు. వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను సైతం షేర్ చేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే హీరోయిన్లలో క్రష్ ఎవరు..? అనే ప్ర‌శ్న చ‌ర‌ణ్ కు ఎదురైంది. దాంతో ఒకింత ఇబ్బంది పడ్డ చ‌ర‌ణ్‌.. ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయక తప్పలేదు.

`హాలీవుడ్‌ హీరోయిన్స్‌ జూలియా రాబర్ట్స్, కేథరీన్ జీటా జోన్స్‌ అంటే నాకు చాలా ఇష్టం. జూలియా రాబర్ట్స్‌ నా ఫస్ట్‌ క్రష్‌. ఆమెను టీవీలో చూసినా, బిగ్‌ స్క్రీన్‌పై చూసినా కళ్లార్పకుండా అలా చూస్తూ ఉండిపోతాను. ఆమె నన్ను అంతగా ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ప్రెట్టీ ఉమెన్ మూవీ చూశాక, ఆమెకు నేనె పెద్ద ఫ్యాన్ అయిపోయా. ఇక నా మరో క్రష్‌.. కేథరిన్‌ జెటా జోన్స్‌. ఆమె నటించిన సినిమాల్లో నేను చూసిన మొద‌టి సినిమా ‘ది మార్క్‌ ఆఫ్‌ జోరో’. ఆ మువీలో కేథరిన్‌ నటన నన్నెంతో ఆకట్టుకుంది` అంటూ రామ్ చ‌ర‌ణ్ చెప్పుకొచ్చాడు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Share post:

Latest