అమెరికన్ టాక్ షోలో చ‌ర‌ణ్ సంద‌డి.. యాంక‌ర్ ను ట‌చ్‌లో ఉండ‌మ‌ని చిలిపి కోరిక‌!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్‌` సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్‌ గా పాపులర్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను తాజాగా ప్రఖ్యాతి హాలీవుడ్ అవార్డ్స్ HAC (హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్) కి ప్రజెంటర్ గా ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికా వెళ్లిన రామ్ చ‌ర‌ణ్ కు మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది.

అమెరికాలో అత్యధిక మంది వీక్షించే పాపులర్ షోలలో ఒకటైన `గుడ్ మార్నింగ్ అమెరికా`లో పాల్గొనే అవ‌కాశాన్ని చ‌ర‌ణ్ ద‌క్కించుకున్నారు. తాజాగా ఈ షోలో చ‌ర‌ణ్ సంద‌డి చేశారు. ముగ్గురు యాంకర్లు చరణ్ తో చిట్ చాట్ చేశారు. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా పంచుకున్నాడు. ఎంతో సర‌దాగా సాగిపోయిన ఈ షోలో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మ‌రియు రాజ‌మౌళి గురించి చ‌ర‌ణ్ ఎంతో గొప్ప‌గా చెప్పాడు.

అయితే త‌న ఫ‌స్ట్ బేబీ గురించి కూడా ప్ర‌స్తావించాడు. తండ్రి కాబోతున్నందుకు ఎలాంటి భయం ఉంది అని ఓ యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా.. `ఇన్నేళ్లు నేను ఉపాసనకు అంతగా దొరికేవాడిని కాదు. కానీ ఇప్పుడు తప్పడం లేదు` అని ఫన్నీగా చరణ్ తెలిపాడు. ఇక యాంకర్స్ లో ఒక లేడి యాంకర్ గైనకాలజిస్ట్ అని రామ్ చరణ్ కి ముందే తెలుసు. ఈ నేప‌థ్యంలోనే `నేను మీ నంబర్ తీసుకుంటాను. ఉపాసన నేను అమెరికా వచ్చినప్పుడు ట‌చ్ లో ఉండండి` అని చ‌ర‌ణ్ చిలిపి కోరిక కోరాడు. అందుకు స‌ద‌రు యాంకర్.. `తప్పకుండా.. మీతో కలసి ఎక్కడికైనా ట్రావెల్ చేసేందుకు సిద్ధం` అని హ‌మీ ఇచ్చేసింది.

Share post:

Latest