రాజమౌళి తన చెల్లెలుతో విభేదాలపై .. క్లారిటీ ఇదే..!!

డైరెక్టర్ రాజమౌళి పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది. దేశం గర్వించదగ్గ సినిమాలు తీసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ దర్శకుల నుంచి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్నారు. అయితే ఈయనకు ఒక చెల్లెలు ఉందని విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఈమె కూడా ప్రముఖ సింగర్ . ఈమె పేరు శ్రీలేఖ రాజమౌళికి ఈమెకు మధ్య ఎన్నో ఏళ్లుగా గొడవలు ఉన్నాయని వార్తలు ఇండస్ట్రీలో వైరల్ గా మారుతున్నాయి. అందుకే రాజమౌళి ఆయన సినిమాలలో చిన్న అవకాశం కూడా ఇవ్వరని టాక్ బయట వినిపిస్తూ ఉంటుంది.

SS Rajamouli: వరల్డ్ మ్యూజిక్ టూర్ కు రెడీ అవుతున్న శ్రీలేఖ! - NTV Telugu
తాజాగా వీరిద్దరూ కలిసి ఒక పని చేసి ఆ రూమర్స్ కు చెక్ పెట్టారు. ప్రముఖ సంగీత దర్శకులు శ్రీలేఖ తన సినీ కెరియర్లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 25 దేశాలలో వరల్డ్ మ్యూజిక్ టూర్ ని చేయబోతున్నది ఈ ఏడాది మార్చి 17 నుంచి ఈ పర్యటన ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన పోస్టర్ను ఆమె సోదరుడు రాజమౌళి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ప్రపంచంలోని ఐదు భాషలలో 80 సినిమాలకు సంగీతం అందించిన ఏకైక మహిళ సంగీత దర్శకురాలు శ్రీలేఖ అని తెలిపారు.

తాను సాధించిన ఘనతకు అభినందనలు తెలియజేస్తున్నానని ఆస్కార్ వేడుకకు వెళ్ళబోతున్న రాజమౌళి అన్న చేతులమీదుగా తన వరల్డ్ మ్యూజిక్ పోస్టర్ని లాంచ్ కావడం తనకి చాలా సంతోషంగా ఉందని తెలియజేసింది శ్రీలేఖ. రాజమౌళి దర్శకత్వం వహించిన మొదటి సీరియల్ శాంతినివాసం అనే సీరియల్ కి మ్యూజిక్ అందించినట్లుగా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక పోస్టర్ వైరల్ గా మారుతోంది.

Share post:

Latest