తన సినిమాలను థియేటర్లకు వెళ్లి వందలసార్లు చూసిన రాజమౌళి.. ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్!

ఎస్‌ఎస్ రాజమౌళి బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌బస్టర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఈ దిగ్గజ దర్శకుడు తన ఆడియన్స్ తన సినిమాలు ఎలా తీసుకుంటారో అర్థం చేసుకోవడానికి ఇష్టపడతాడట. ఈ విషయాన్ని ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపాడు. తన సినిమాలను ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలుసుకునేందుకు అతను తన సినిమాలను థియేటర్‌లకు వెళ్లి వందలసార్లు చూసేవాడట.

అతను తన పనిని అంచనా వేయడానికి ఇలా తన చిత్రాలను చాలాసార్లు చూస్తాడట. ప్రేక్షకులు తన సినిమాలను ఎలా రిసీవ్ చేసుకుంటారో అర్థం చేసుకోవడానికి తరచుగా థియేటర్లను సందర్శిస్తానని రాజమౌళి తాజాగా ది న్యూయార్కర్ ఇంటర్వ్యూలో తెలిపాడు. అతను మాట్లాడుతూ, “నా సినిమాలను అంచనా వేయడానికి బెస్ట్ వే థియేటర్‌లో ప్రేక్షకులతో కూర్చుని వారి రియాక్షన్స్‌ అనుభవించడం. నేను కొన్నిసార్లు నా సినిమాలు ప్లే చేసే థియేటర్లకు పది, ముప్పై, నలభై లేదా వందసార్లు వెళ్ళాను. ప్రేక్షకులు ఎలా అర్థం చేసుకుంటున్నారో అర్థం చేసుకోవడానికే ఇలా చేశాను” అన్నాడు.

ఇదే ఇంటర్వ్యూలో అతను ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆ విషయాల ప్రకారం, రాజమౌళి తన చిన్నతనంలో భారతీయ ఇతిహాసాలైన మహాభారతం, రామాయణాలు చదివాడు. వాటి ప్రభావంతో ఆయన కథాగమనం జరిగింది. ఈ డైరెక్టర్ ఈ ఇతిహాసాల పాత్రలలోని సంఘర్షణలను, వారి ప్రేరణలను అభినందిస్తాడు. ఈ గ్రంథాలు జక్కన్న పనికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఈ దర్శకుడు ఈ కథలు మహాసముద్రాల వంటివని ఇంటర్వ్యూలో తెలిపాడు. వీటిని తిరిగి చదివినప్పుడల్లా కొత్త విషయాలను రాజమౌళి కనుక్కుంటానని చెప్పాడు.

Share post:

Latest