పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈయన ఏకకాలంలో మూడు సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. అందులో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న `సలార్` ఒకటి కాగా.. మరొకటి నాగశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న `ప్రాజెక్ట్-కె`. అలాగే మరోవైపు మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు.
ఈ మూడు ప్రాజెక్టులు ప్రస్తుతం సెట్స్ మీదే ఉండడంతో.. ప్రభాస్ క్షణం తీరిక లేకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో ఫుల్ బిజీ గా మారాడు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ కోసం సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. కెరీర్ ఆరంభంలో ప్రభాస్ సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ లో పాల్గొన్నారు. తన టీం తరపున బ్యాట్స్ మెన్ గా బాధ్యతలు నిర్వర్తించాడు.
ఈ మ్యాచ్ కి కమెడియన్స్ వేణు మాధవ్, శ్రీనివాసరెడ్డి కామెంటేటర్స్ గా ఉన్నారు. క్రీజులో ఉన్న ప్రభాస్ బంతిని బలంగా బాది బౌండరీకి తరలించాడు. దాంతో బౌండరీ కొట్టిన ప్రభాస్ తో బ్యాట్ ఎత్తాలని వేణు మాధవ్ మైక్ లో చెప్పడమే కాకుండా మ్యూజిక్ వేయమన్నారు. అప్పుడు వర్షం మూవీలోని `మెల్లగా కరగని` సాంగ్ ప్లే చేయగా.. గ్రాండ్ లో ప్రభాస్ స్టెప్పులైశాడు. ఈ త్రో బ్యాక్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
#Prabhas 😂❤️ pic.twitter.com/mYchzLCfx2
— Roaring REBELS (@RoaringRebels_) February 26, 2023