ఆస్తుల కంటే పవన్ కి అప్పులే ఎక్కువ… నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్ వైరల్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో ఇంకోవైపు సినిమాలో చాలా బిజీగా ఉన్నారు. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి మంచి పేరు, పలుకుబడి ఉంది. అంతేకాకుండా, ఆయన ఒక్కో సినిమాకి భారీగానే పారితోషికం అందుకుంటారు. అయితే అంత రెమ్యూనరేషన్ తీసుకునే పవన్‌కి అప్పులు కూడా ఎక్కువగానే ఉన్నాయని అంటుంటారు కొంతమంది. అసలు ఈ విషయం ఎంతవరకు నిజం అనేదాని గురించి నాగబాబు స్పష్టంగా వివరించారు.

పవన్ కళ్యాన్ ఇటీవలే రైతు భరోసా యాత్రలో పాల్గొన్నారు. ఆ యాత్రలో ఎంతో మంది రైతులకు ఆర్థిక సహాయం చేసారు. అంతేకాకుండా వివిధ సందర్భాలలో చాలా మందికి సహాయం అందించానని, ఇప్పటివరకు తాను ఎన్నో ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్నానని పవన్ చాలా సార్లు ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా ఆయనకు బాగా దగ్గరగా వుండేవాళ్ళు కూడా చాలామంది ఆయనకు నిధుల కొరత ఉందని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి.

అయితే ఇటీవలే నాగబాబు మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్‌కి ఆస్తులకంటే ఎక్కువగా అప్పులే ఉన్నాయి. ఈ విషయం ఎవరికి చెప్పినా నమ్మరు. పవన్ ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకున్నా కూడా ఆ డబ్బుని ప్రజల కోసం, పార్టీ కోసం ఖర్చు చేస్తాడు. అంతేకాకుండా పార్టీ కోసం పిల్లల పేరు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ ని కూడా బ్రేక్ చేసాడు.” అని నాగబాబు స్పష్టంగా వివరించారు. పవన్‌కి కేవలం 8 ఎకరాల భూమి ఉన్న ఫార్మ్ మాత్రమే ఉంది, అంతకుమించి విలువైన ఆస్తులు ఏమీ లేవు, అలానే రాజకీయాల్లో అడ్డదరిలో సంపాదించే ఉదేశ్యం కూడా పవన్ కి లేదు అని నాగబాబు కామెంట్స్ చేసారు.

Share post:

Latest