మరొకసారి హైపర్ ఆది పై విరుచుకుపడుతున్న నేటిజన్స్..?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో పలు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు హైపర్ ఆది. అంతేకాకుండా రాజకీయంగా కూడా జనసేన పార్టీ తరఫున ప్రచార కార్యకర్తగా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హైపర్ ఆది జబర్దస్త్ మానివేయడం జరిగింది. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మాత్రం కనిపిస్తూ ఉన్నారు.హైపర్ ఆది అక్కడ వరుసగా ఎపిసోడ్లో చేస్తూ భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.

Hyper Aadi | Hyper Aadi - @itshyperaadi, Hyperaadi, Jabardasthhyper

హైపర్ ఆది కామెడీ పేరుతో కాస్త వల్గర్ గా ప్రవర్తిస్తున్నారని వార్తలు గత కొంతకాలంగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో తనకంటే పెద్దవారైన మహిళల పట్ల కూడా ఆయన అపహేళనలుగా మాట్లాడుతున్నారని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. హైపర్ ఆది చాలా కాలంగా కూడా సీనియర్ నటీమణులతో వివాదాస్పదంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఇక వారి పైన వేసి పంచు డైలాగులు కూడా ప్రేక్షకులను విరక్తి పుట్టించేలా చేస్తున్నా ఈ దీంతో హైపర్ ఆది పైన కొంతమంది మహిళలు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు సమాచారం.

Hyper Aadi In The Election Ring.. Names Of Two Constituencies On The Screen!
అయితే ఈసారి తాజాగా ఒక సీనియర్ నటి పైన కూడా హైపర్ ఆది చేసిన వివాదాస్పదమైన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నట్లు తెలుస్తోంది. కనీసం ఆడవారిని గౌరవించకుండా హైపర్ ఆది చేస్తున్న కామెడీ పైన పలు రకాలుగా మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.కామెడీ పేరుతో ఇంత రెచ్చిపోయి ఆడవారిని అవమానించడం అవసరమా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు మరి కొంతమంది మాత్రం.. హైపర్ ఆది ఎప్పుడు కూడా వారిని చులకనగా చూడరని కేవలం కామెడీ కోసమే ఆడవారి పట్ల కాస్త తక్కువగా మాట్లాడుతూ ఉంటారని అభిమానులు తెలియజేస్తున్నారు. గతంలో కూడా ఆడవారి గురించి హైపర్ ఆది ఆడవారు అంటే గౌరవమని కూడా తెలియజేశారు.

Share post:

Latest