`ఎన్టీఆర్ 30` కొత్త లాంఛింగ్ డేట్ లాక్‌.. తీవ్ర నిరాశ‌లో ఫ్యాన్స్‌!?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్‌` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం ఎన్టీఆర్ నుంచి రాబోతున్న చిత్ర‌మిది. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్ తో రెండేళ్ల క్రిత‌మే ఈ మూవీని ప్ర‌క‌టించారు. కానీ, ఇంత వ‌రకు ఈ సినిమా ప్రారంభం కాలేదు.

ఈ సినిమా సెట్స్‌పైకి రావ‌డానికి అవాంత‌రాలు ఎదుర‌వుతూనే ఉన్నాయి. ఫిబ్ర‌వ‌రి 24న ఈ సినిమాను పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ్ చేసి.. మార్చి 20 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ను ప్రారంభించాల‌ని మేక‌ర్స్ స‌న్నాహాలు చేశారు. కానీ, ఇంత‌లోనే నంద‌మూరి తార‌క‌ర‌త్న మృతి చెందారు. దీంతో ఈ సినిమా ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేశారు.

అయితే తాజాగా `ఎన్టీఆర్ 30` కొత్త లాంఛింగ్ డేట్ ను లాక్ చేశారు. ఈ ఈవెంట్‌ను మార్చి 18న నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఆస్కార్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ హాజ‌రు కాబోతున్నారు. అందువ‌ల్లే మార్చి 15 త‌ర్వాతే ఓపెనింగ్ ఈవెంట్‌ను జ‌రిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌ను మొద‌లుపెట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది. ఇక షూటింగ్ స్టార్ట్ కావ‌డానికి మ‌రో నెల ఆల‌స్యం అవుతుండ‌టంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ‌లో మునిగిపోయారు.

Share post:

Latest