అందులో నిజం లేదు.. ఫైన‌ల్ గా ఆ విష‌యంపై స‌మంత టీమ్ క్లారిటీ!

కొద్దిరోజుల నుంచి సమంతకు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట‌ వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ `పుష్ప` పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేసింది. `ఊ అంటావా మావా` అంటూ ఓ ఊపు ఊపేసింది.

ఇక ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 రాబోతోంది. ఇటీవల సెట్స్‌ మీదకు వెళ్ళిన ఈ చిత్రం శ‌రవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే రెండో భాగంలోనూ ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందట. అయితే ఆ పాట కోసం మళ్లీ సమంతనే సంప్రదించారని.. అయితే అందుకు ఆమె నో చెప్పిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

ఇతర ప్రాజెక్టుల‌ కారణంగా పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేయ‌లేన‌ని సమంత చెప్పినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంపై సమంత టీం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నెట్టింట జ‌రుగుతున్న‌ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదట. అసలు పుష్ప 2 నుంచి ఎలాంటి ఆఫర్ సమంత వ‌ద్ద‌కు రాలేద‌ని.. అస‌త్య ప్ర‌చారాన్ని న‌మ‌వ‌ద్ద‌ని టీమ్ పేర్కొంది. కాగా, స‌మంత ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండకు జోడీగా `ఖుషి` మూవీలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌ రాజ్ & డీకే ద‌ర్శ‌క‌త్వంలో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. వీటితో పాటు మ‌రిన్ని ప్రాజెక్ట్ లు కూడా స‌మంత చేతిలో ఉన్నాయి.

Share post:

Latest