ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ మూవీ సూప‌ర్ హిట్టే!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ప్ర‌స్తుతం ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీ‌లీల ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అతడు ఖలేజా సినిమాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇటీవల సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం శ‌ర‌ వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆగస్టు 11న ఈ సినిమా విడుదల కానుంద‌ని ఇప్పటికే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా విడుదల విషయంలో ఓ సెంటిమెంట్ తెర‌పైకి వచ్చింది. అదేంటంటే గ‌తంలో ఆగస్టు నెల‌లో విడుదలైన మహేష్ చిత్రాలు మంచిది సాధించాయి.

2004‌ ఆగస్టు 18న మహేష్ నటించిన అర్జున్ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. అలాగే 2005 ఆగస్టు 10న అతడు సినిమా విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. 2015 ఆగస్టు 7న శ్రీమంతుడు రిలీజ్ అవ్వ‌గా.. ఈ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. సెంటిమెంట్ పరంగా చూసుకుంటే మహేష్ కు ఆగస్టు నెల బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ రిపీట్ అయ్యింది అంటే మహేష్ త్రివిక్రమ్ సినిమా సైతం సూపర్ హిట్ అవడం ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Share post:

Latest