తండ్రైన న‌వీన్ చంద్ర‌.. కొడుకు ఫోటోలు షేర్ చేస్తూ ఎమోష‌న‌ల్‌!

హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఓవైపు సినిమాలు, మ‌రోవైపు వెబ్ సిరీస్ ల‌తో సత్తా చాటుతున్న ప్రముఖ నటుడు నవీన్ చంద్ర తండ్రిగా ప్రమోట్ అయ్యాడు. గతేడాది వాలెంటైన్స్ డే సందర్భంగా భార్య ఓర్మాని పరిచయం చేశారు. తనలో సగం అంటూ ఆమెపై ప్రేమని పంచుకున్నారు. ఈ ఏడాది వాలెంటైన్స్ డేకు తండ్రికాబోతున్నట్లుగా తెలుపుతూ.. నెలలు నిండిన తన భార్యతో దిగిన‌ ఫొటోలను షేర్ చేశారు.

అయితే తాజాగా న‌వీన్ చంద్ర స‌తీమ‌ణి పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. దీంతో నవీన్ చంద్ర ఫ్యామిలీ ఆనందంలో మునిగిపోయింది. ఇక తాను తండ్రైన విష‌యాన్ని న‌వీన్ చంద్ర ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించాడు. ‘నేను, ఓర్మా.. మగ బిడ్డతో ఆశీర్వదించబడ్డాము` అని తెలుపుతూ.. కొడుకుతో ఉన్న ఫొటోలను నవీన్ చంద్ర షేర్ చేశారు.

ఈ పిక్స్ లో త‌న‌యుడి కాలుని ముద్దాడుతూ ఎమోష‌న‌ల్ అయ్యాడు న‌వీన్ చంద్ర‌. ఆయన కళ్లలో ఆనందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. ప్ర‌స్తుతం ఈ పిక్స్ నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటూ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నారు. అభిమానులు మ‌రియు నెటిజ‌న్లు న‌వీన్ చంద్ర దంప‌తుల‌కు విషెస్ తెలుపుతున్నారు.

Share post:

Latest