నెపోటిజంపై నాని ఇలా, రానా అలా.. చరణ్ పేరు తెస్తూ షాకింగ్ కామెంట్స్‌!

నెపోటిజం.. దాదాపు అన్ని వృత్తిల్లో ఉంది. కానీ, సినీ ప‌రిశ్ర‌మ‌లో మాత్రం నెపోటిజం అనేది ఒక వివాస్ప‌ద టాపిక్‌. ఇండ‌స్ట్రీలో వారసులే హీరోలు, హీరోయిన్లు అవటం మనం చూస్తూనే ఉన్నాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా వరకూ టాప్‌ హీరోలు అలాంటి వాళ్లే. అయితే తాజాగా ఈ వివాదాస్పద నెపోటిజం సబ్జెక్ట్‌పై న్యాచుర‌ల్ స్టార్ నాని స్పందించారు. ఈ సంద‌ర్భంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పేరు తెస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఇటీవ‌ల ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ లో `నిజం విత్ స్మిత` అనే టాక్ షో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. తొలి ఎపిసోడ్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఫ‌స్ట్ ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజ‌రు అయ్యారు. అయితే రెండో ఎపిసోడ్ కు రానా ద‌గ్గుబాటి, నాని గెస్ట్ లు గా హాజ‌రు అయ్యారు. అయితే ఈ షోలో నెపోటిజం గురించి ప్ర‌స్తావ‌న రాగా.. నాని, రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

`అసలు నెపోటిజంని పెంచి పోషిస్తుంది ప్రేక్షకులే. నాని డెబ్యూ మూవీ లక్షల్లో చూస్తే రామ్ చరణ్ డెబ్యూ మూవీ కోట్లలో చూశారు. ఆ లెక్కన నెపోటిజాన్ని ప్రోత్సహిస్తుంది జనాలే కదా` అంటూ నాని పేర్కొన్నాడు. మ‌రోవైపు రానా `తల్లిదండ్రుల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పిల్లల మీద ఉంది` అని చెప్పుకొచ్చాడు. కాగా, వీరిద్దరిలో నాని అవుట్ సైడర్ కాగా, రానా నెపోకిడ్ అన్న విష‌యం తెలిసిందే.

Share post:

Latest