నాగార్జున- రాజశేఖర్ మల్టీస్టారర్ మూవీ.. సక్సెస్ అయ్యేనా..?

టాలీవుడ్ లో కింగ్ నాగార్జున ప్రస్తుతం తనదైన స్టైల్ లో సినిమా కథలను చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ప్రస్తుతం డైరెక్టర్ ప్రసన్నకుమార్ బెజవాడ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ గా ప్రారంభమయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరొక నటుడు యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖర్ కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ ఉన్నారు. హీరోగా కెరియర్ క్లోజ్ అయినప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా టర్న్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే సరైన కథ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

TeluguCinemaCharitra on Twitter: "Rare pic #AkkineniNagarjuna | #Rajasekhar  https://t.co/4eNQtQtiAo" / Twitterమరొకవైపు కొత్త దర్శకుల కథలు వింటున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మార్కెట్ పరంగా రాజశేఖర్ సినిమాలు థియేటర్లలో ప్రస్తుతం ఆడలేదు.. కనుక డిఫరెంట్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలోనే వీరిద్దరి కాంబినేషన్లో ఒక మల్టీ స్టార్ మూవీ మొదలయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి . గతంలో కూడా ఈ కాంబినేషన్ ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో ప్లాన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఓపెనింగ్ కార్యక్రమాలు కూడా జరిగాయి.

వెంకటేష్ అక్కినేని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లు ఈ సినిమాని నిర్మించడానికి సిద్ధమయ్యారు కథ కూడా ఫైనల్ చేసిన తర్వాత క్యాస్టింగ్ సెలక్షన్ చేసుకుని సెట్స్ పైకి వెళ్తుందని అందరూ అనుకున్నారట. అయితే కొన్ని కారణాల చేత ఈ కాంబినేషన్ వర్కౌట్ కాలేదని సమాచారం. ఆ తర్వాత నాగార్జున ఈవీవీ సినిమాలు చేసి మంచి హిట్స్ కొట్టాడు కానీ రాజశేఖర్ తో మాత్రం కెరియర్ లో ఒక్క సినిమా మాత్రమే చేశారు. అది కూడా డిజాస్టర్ మిగిలిపోయింది. మరి ఆ రోజుల్లో ఆగిపోయిన వీరి కాంబినేషన్ మరి ఈసారి వీరిద్దరి కెరియర్ ని మారుస్తుందేమో చూడాలి మరి.

Share post:

Latest