మిస్ ఇండియాను ప‌ట్టేసిన మన్మధుడు.. ఏజ్ గ్యాప్ తెలిస్తే షాకైపోతారు!

అక్కినేని మ‌న్మ‌ధుడు, టాలీవుడ్ కింగ్ నాగార్జున గ‌త ఏడాది `ది ఘోస్ట్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌లం అయింది. ఈ మూవీ త‌ర్వాత నాగార్జున నుంచి మ‌రో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ రాలేదు. అయితే ది ఘోస్ట్ రిజ‌ల్ట్‌ను దృష్టిలో పెట్టుకొని త‌దుప‌రి సినిమా క‌థ విష‌యంలో నాగార్జున ఆచితూచి అడుగులు వేస్తోన్నారు.

ఈ నేప‌థ్యంలోనే అనేక చ‌ర్చ‌ల అనంత‌రం `ధ‌మాకా` ర‌చ‌యిత‌ ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ ద‌ర్శ‌క‌త్వంలో త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ సినిమాలో అల్ల‌రి న‌రేష్ మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఫిబ్ర‌వ‌రిలోనే ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభం కానున్న‌ట్లు తెలిసింది.

ఇక‌పోతే ఈ సినిమా కోసం మ‌న మ‌న్మ‌ధుడు మిస్ ఇండియాను ప‌ట్టేశాడు. ఈ మూవీలో నాగార్జున సరసన మిస్ ఇండియా మానస వారణాసి నటించబోతోంది. ఇప్పటికే సంప్ర‌దింపులు పూర్తి అయ్యాయి. అలాగే నాగ్, మనసుల పై ఫోటో షూట్ కూడా జరిగిందని అంటున్నారు. అయితే నాగార్జున‌, మాన‌స మ‌ధ్య ఏజ్ గ్యాప్ తెలిస్తే షాకైపోతారు. ఎందుకంటే, వీరిద్ద‌ర మ‌ధ్య 35 ఏళ్ల‌కు పైగా ఏజ్ గ్యాప్ ఉంది. అంటే కూతురు వ‌య‌సున్న హీరోయిన్ తో నాగ్ రొమాన్స్ చేయ‌బోతున్నాడు. మ‌రి వీరి కెమిస్ట్రీ తెర‌పై ఎంత వ‌ర‌కు పండుతుందో చూడాలి.

Share post:

Latest