మరొక గోల్డెన్ ఆఫర్ అందుకున్న మృణాల్ ఠాకూర్..!!

దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన పీరియాడికల్ లవ్ స్టోరీ సీతారామం. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీతగా ఈ సినిమాలో మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఈమె మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. ఆగస్టులో విడుదలైన ఈ సినిమా అనూహ్య విజయాన్ని అందుకుంది. ఇక అంతే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంది.ఈ ముద్దుగుమ్మ ఈ చిత్రంలో సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ పేరు సంపాదించింది.

రాంచరణ్ తో సీత రొమాన్స్.. బుచ్చిబాబు భలే సెట్ చేస్తున్నాడే ?
బ్యాక్ టు బ్యాక్ వరస క్రేజీ ఆఫర్లతో సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే నాని సినిమాలో కూడా నటించబోతోందని తెలుస్తోంది. మరి ఇప్పుడు గోల్డెన్ అవకాశాన్ని అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు వివరాల్లోకి వస్తే రామ్ చరణ్..RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో క్రేజన సంపాదించారు. ప్రస్తుతం హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కేమరూన్ నుంచి ప్రత్యేకమైన ప్రశంశాలు కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఆస్కార్ బరిలో నిలిచిన RRR సినిమా తర్వాత రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులలో నటించబోతున్నారు.

డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లు తమ 15వ సినిమా అని చేస్తున్నారు. ఇక ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా అయిపోయిన వెంటనే రామ్ చరణ్ డైరెక్టర్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో ఒక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇందులో రామ్ చరణ్ కు జోడిగా మృణాల్ ఠాకూర్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

Share post:

Latest