సినిమా పరిశ్రమలో హీరోయిన్లుగా ఎంతమంది తల్లి కూతుర్లు ఉన్నారో తెలుసా?

తెలుగు సినిమా అంటేనే రకరకాల నటీమణులకు పెట్టింది పేరు అంటారు సినిమా ఉద్ధండులు. అనాదినుండి ఇక్కడ హీరోలతో పాటుగా, హీరోయిన్ లకు కూడా ఎంతో గుర్తింపు వుంది. అందుకనే వివిధ ప్రాంతాలవారు ఇక్కడ అంటే మన తెలుగు గడ్డపైనే హీరోయిన్లుగా చలామణి అవుతూ వుంటారు. అంతేకాకుండా వారి వారసురాళ్లను కూడా ఇక్కడ హీరోయిన్లుగా దింపుతూ వుంటారు. దానికి పెట్టింది పేరుగా చాలామంది టాలీవుడ్ ని చెబుతూ వుంటారు. స్టార్ హీరోలు, దర్శకులు, ప్రొడ్యూసర్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా సినిమా పరిశ్రమలో చాలామంది వారసులు ఉన్నట్లే తల్లి నటి అయితే కూతురు కూడా నటిగానే రాణిస్తున్న వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు.

అవును, అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ నటి పేరు హీరోయిన్ లక్ష్మి. అప్పట్లో శోభన్ బాబు వంటి హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో హిట్స్ అందుకున్న ఈమె సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అత్తా, అమ్మా పాత్రలతో రాణించి, ఇప్పుడు బామ్మ పాత్రలతో సైతం మెప్పిస్తూ ఇండస్ట్రీలో నేటికీ కొనసాగుతోంది. ఇక మిధునం మూవీలో బాల సుబ్రహ్మణ్యంతో కలిసి నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఈమధ్య వచ్చిన ఓ బేబీ లాంటి సినిమాల్లో ఆమె నటనకి విమర్శల ప్రశంసలు దక్కాయి.

ఇకపోతే లక్ష్మి కూతురు ఐశ్వర్య కూడా అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, కల్యాణ వైభోగమే, నాని వంటి సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక దక్షిణాది సూపర్ స్టార్ కమల్ హాసన్ కూతుళ్లు శృతిహాసన్, అక్షర హాసన్ లు గురించి ప్రస్తావించాల్సిన పనిలేదు. ఇక మహానటి కీర్తి సురేష్ మంచి పాత్రలతో రాణిస్తోంది. ఈమె తల్లి మేనక సురేష్ కుమార్ మలయాళ, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ మూవీస్ లో నటించిన సంగతి విదితమే. ఇక బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ కూతురు సారా అలీఖాన్ స్టార్ హీరోయిన్ గా ఇపుడు రాణిస్తోంది. ఈమె తల్లి అమృతా సింగ్ కూడా హీరోయిన్ గా చాలా మూవీస్ లో చేసింది. ఇలా చెప్పుకుంటే పోతే పెద్ద లిస్ట్ అవుతుంది కానీ, ఇలాంటివారు ఇంకా చాలామందే వున్నారు.

Share post:

Latest