SSMB 28 లో ముచ్చ‌ట‌గా మూడో హీరోయిన్‌.. వ‌ద్దు మ‌హేషా.. ఆ రిస్క్ చెయ్య‌కు!?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే `SSMB 28` వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. ఇప్పుడు శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాలో ముచ్చటగా మూడో హీరోయిన్ ఎంపిక చేశారని నెట్టింట‌ జోరుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమి పడ్నేకర్ ను మూడో హీరోయిన్ గా తీసుకున్నార‌ట‌. ఈమె ఈ సినిమాలో లేడీ కానిస్టేబుల్ రోల్ లో క‌నిపించ‌నుంద‌ని అంటున్నారు. ఈ విషయం పట్ల మహేష్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.

ఎందుకంటే మహేష్‌కు ముగ్గురు హీరోయిన్లు అస్స‌లు కలిసి రాలేదు. గతంలో బ్రహ్మోత్సవం సినిమాలో కాజల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఇప్పుడు SSMB 28 లోనూ ముగ్గురు హీరోయిన్లు అంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో బ్రహ్మోత్సవం సెంటిమెంట్ ఎక్కడ రిపీట్ అవుతుందో అని మహేష్ ఫ్యాన్స్ భ‌య‌పడుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ముగ్గురు హీరోయిన్ల‌ను తీసుకుని రిస్క్‌ చెయ్యొద్దు అంటూ మ‌హేష్ బాబును ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.

Share post:

Latest