ఎట్ట‌కేల‌కు వ‌రుణ్ తేజ్‌పై త‌న ఇష్టాన్ని బ‌ట్టబ‌య‌లు చేసేసిన లావణ్య త్రిపాఠి!

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్ద‌రూ పెళ్లి పీటలు ఎక్కనున్నారని కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. గతంలో మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య‌ కలిసి నటించారు. ఆ స‌మ‌యంలో వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డార‌ని టాక్ న‌డుస్తోంది.

ప్రైవేట్ పార్టీలో ఇద్దరు జంటగా పలుమార్లు కనిపించడం, వరుణ్ తేజ్‌ చెల్లెలు నిహారిక పెళ్లిలో లావణ్య త్రిపాఠి సందడి చేయడం వంటి అంశాలు నెట్టింట జరుగుతున్న ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చాయి. కానీ, ఈ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని లావణ్య త్రిపాఠి గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో కొట్టిపారేసింది. కానీ, ఇప్పుడు వ‌రుణ్ తేజ్ మోస్ట్ హ్యాండ్సమ్ అంటూ త‌న ఇష్టాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసేసింది.

అస‌లేం జ‌రిగిందంటే.. `పులిమేక` మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా లావ‌ణ్య ట్రీమ్ తో క‌లిసి సుమ యాంకర్‌గా చేస్తున్న `సుమా అడ్డా` షోలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా సుమ `పులిమేక‌` టీమ్ తో గేమ్స్ ఆడిస్తూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను రాబ‌ట్టింది. ఈ క్ర‌మంలోనే సుమ‌.. `వీరిలో మోస్ట్ హ్యాండ్సమ్‌ హీరో ఎవరు..? అంటూ ఏ-నాని, బీ-వరుణ్‌ తేజ్‌ పేర్లు చెప్పింది సుమ. దీనికి లావణ్య త్రిపాఠి రియాక్ట్ అవుతూ.. వరుణ్ తేజ్‌ పేరు చెప్పింది. వరుణ్ మోస్ట్ హ్యాండ్సమ్‌ హీరో అని ఆమె తన మనసులోని మాటని రివిల్ చేసింది. దీంతో సుమతో పాటు చిత్ర టీమ్‌ అవాక్కయ్యారు. ఇక ఆడియెన్స్ తెగ గోల గోల చేసేశారు. మొత్తానికి లావ‌ణ్య వ‌రుణ్ తేజ్ పేరు చెప్ప‌డంతో మ‌ళ్లీ వీరి ప్రేమ‌, పెళ్లి వార్త‌లు ట్రెండ్ అవుతున్నాయి.

Share post:

Latest