జబర్దస్త్‌లో రోహిణి ఇంకా రాణిస్తున్నందుకు కారణం అదేనా?

జబర్దస్త్ రోహిణి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఈ షోలో మొదటి లేడీ టీమ్ లీడర్ గా రోహిణి రాణించిన విషయం అందరికీ తెలిసిందే. మొదట సీరియల్ ద్వారా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను అలరించిన రోహిణి ఆ తర్వాత బిగ్ బాస్ తో మంచి పాపులారిటీని సంపాదించింది. ఇక స్టార్ మాలో చాలా కాలం పాటు కొనసాగిన రోహిణి అప్పుడప్పుడు జబర్దస్త్ కార్యక్రమంలో మెరిసేది. ఆమె కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ కి ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యేవారు. అందుకే ఆమెను ఏకంగా టీం లీడర్ గా మల్లెమాల వారు నియమించడం జరిగింది.

అయితే ఒక మహిళగా ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. లేడీ టీమ్ లీడర్ ఏంటి? అంటూ చాలా మంది ఆమెపై కోల్డ్ వార్ ప్రటించారు. అయితే వాటిని ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకొని పోయేది. ఈ క్రమంలో సదరు షోలో ఆమె మొదట తడబడినా ఆ తర్వాత పర్వాలేదు అనిపించింది. ప్రస్తుతం జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాల్లో ఉన్న పలువురు టీం లీడర్స్ తో పోలిస్తే రోహిణి చాలా ఉత్తమంగా ప్రదర్శన కనబరుస్తోంది అని మల్లెమాల ఆమెని సర్వదా ప్రోత్సహించడం జరుగుతోంది.

అయితే కొందరు జబర్దస్త్ ప్రేక్షకులు మాత్రం రోహిణి కిట్స్ పైన పెదవి విరుస్తున్నారని టాక్ నడుస్తోంది. మరి ఇలాంటి తరుణంలో కూడా మల్లెమాల ఆమెని ఎందుకు కంటిన్యూ చేస్తోందని అనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఆమె రెమ్యూనరేషన్ కోసం కాకుండా పాపులారిటీ కోసం జబర్దస్త్ కార్యక్రమాన్ని చేస్తుంది. అందుకే మల్లెమాల వారు ఆమెను కంటిన్యూ చేస్తున్నారని ఒక వర్గం వారు చెబుతున్నారు. ఆమె రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన వెంటనే ఆమెని తొలగిస్తారని కూడా అంటున్నారు. లోగుట్టు పెరుమాళ్ళకెరుక గాని ఆమె పట్ల మాత్రం కాస్త వివక్ష కనిపిస్తోంది అనడంలో సందేహమే లేదు.