ఆ ఒక్క మాటతో ఆదిపురుష్‌పై హైప్‌ మొత్తం పెంచేసిన కృతి సనన్‌!!

 

ప్రముఖ నటుడు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఆయన రాముడిగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా కోసం డార్లింగ్ అభిమానులు వేయి కళ్ల తో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్‌ని వెండితెరపై రాముడిలా చూడాలనే కోరిక ఫ్యాన్స్‌కి రోజురోజుకీ పెరిగిపోతుంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో మోహన్ సెన్సార్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుండి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ టీజర్ చూసిన తరువాత సినిమా పై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.

తాజాగా కృతి సనన్ ‘ఆదిపురుష్’ సినిమాకి సంబంధించి ఒక్క మాట మాట్లాడి సినిమాపై అంచనాలు మరింతగా పెంచేసింది. ఈ సినిమాలో సీత పాత్ర తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని విశ్వసం వ్యక్తం చేసింది. అంతేకాకుండా, ఆమె రామానంద్ సాగర్ రామాయణాన్ని చూడలేదని చెప్పింది. ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకులకు రామాయణం గురించి పూర్తి అవగాహన వస్తుందని కృతి పేర్కొంది. రామాయణం గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఈ ఒక్క సినిమాతో పూర్తి అవగాహన వస్తుందని ఆమె చెప్పడంతో దీనిని చూడాలని తపన అభిమానుల్లో మరింత పెరిగిపోయింది.

ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘సలార్’లో కూడా ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. సలార్ సినిమా షూటింగ్ తొందరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు ఆ మూవీ టీమ్. దీనిబట్టి చూస్తే ఆదిపురుష్ సినిమా కంటే ముందే సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

 

Share post:

Latest