టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో ఎవరంటే టక్కున ప్రభాస్ పేరు గుర్తుకు వస్తుంది. ఈ హీరో వివాహం ఎప్పుడు అంటూ అభిమానులు సినీ ప్రేక్షకులు సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటివరకు తన పెళ్లి గురించి ఏ విధంగా స్పందించలేదు. ప్రభాస్ బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ మధ్య ఏదో ఉందంటూ గడిచిన కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.అయితే ఈ విషయంపై కృతి సనన్ ఇదివరకే క్లారిటీ ఇచ్చిన కూడా అక్కడక్కడ వీరి గురించి పలు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
గతంలో ఒకసారి ఫిలిం క్రిటిక్ ఉమైర్ సందు తన ట్విట్టర్ నుంచి అధికారికంగా వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసి అందరికి షాక్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మళ్లీ వచ్చేవారం మాల్దీవుల్లో ప్రభాస్ కృతి సనన్ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అంటూ తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు. దీంతో వీరు కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా ఉమైర్ సందు తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు.దీంతో ప్రభాస్ అభిమానులు పెళ్లి పుకార్లు మరింత వైరల్ గా మారాయి.
దీంతో ప్రభాస్ అభిమానుల సైతం ఉమైర్ సందు ను ఆడుకోవడం మొదలుపెట్టారు.వీరి పెళ్లి గురించి కనీసం వారికైనా తెలుసా అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది లైక్స్ కోసం ఏది వస్తే అది మాట్లాడకూడదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు.
BREAKING NEWS: #KritiSanon & #Prabhas will get engaged next week in Maldives 🇲🇻!! So Happy for them.
— Umair Sandhu (@UmairSandu) February 5, 2023