కన్నాకు టీడీపీలో కీ రోల్..బాబు రెడీగానే ఉన్నారా?

తెలుగుదేశం పార్టీలో కన్నా లక్ష్మీనారాయణకు కీ రోల్ ఇవ్వనున్నారా? అంటే పార్టీలో చేరితే కన్నాకు ముఖ్యమైన రోల్ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగానే ఉన్నారని తెలుస్తోంది. కీలక నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతలని కన్నాకు అప్పగించేలా ఉన్నారు. ఇటీవలే బి‌జే‌పికి రాజీనామా చేసిన కన్నా..23వ తేదీన టి‌డి‌పిలో చేరడానికి రెడీ అయ్యారు. చంద్రబాబు సమక్షంలో టి‌డి‌పి కండువా కప్పుకొనున్నారు.

ఇక టి‌డి‌పిలో చేరాక కన్నాది ఎలాంటి పాత్ర ఉంటుందనేది కీలకంగా మారింది. ఎందుకంటే గుంటూరులో టి‌డి‌పిలో బడా నేతలు చాలామంది ఉన్నారు. ధూళిపాళ్ళ నరేంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, జి‌వి ఆంజనేయులు, ఆలపాటి రాజా, కొమ్మాలపాటి శ్రీధర్, బ్రహ్మరెడ్డి, రాయపాటి సాంబశివరావు, తెనాలి శ్రావణ్..ఇలా చెప్పుకుంటూ వెళితే..అన్నీ జిల్లాలతో పోలిస్తే..గుంటూరులో టి‌డి‌పిలో పేరున్న నేతలు ఎక్కువే. అలాంటి సమయంలో కన్నా లాంటి బడా నేత కూడా టి‌డి‌పిలోకి వస్తే..ఆయన పాత్ర ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.

అయితే గుంటూరులో టి‌డి‌పిలో కాపు నేతలు తక్కువే అని చెప్పాలి. అదే వర్గానికి చెందిన కన్నా పార్టీలోకి వస్తే కీలక పాత్ర పోషించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక కన్నాకు పెదకూరపాడు, గుంటూరు వెస్ట్, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పట్టు ఉంది. ఆ స్థానాల్లో టి‌డి‌పి గెలుపు కోసం ఆయన కృషి చేసే అవకాశాలు ఉన్నాయి. అదే  సమయంలో ఆయనకు ఏ సీటు దక్కుతుందనేది క్లారిటీ లేదు.

కాకపోతే ఈ మూడు సీట్లలో ఏదొక సీటు దక్కుతుందనే ప్రచారం జరుగుతుంది. పెదకూరపాడులో శ్రీధర్ ఉన్నారు కాబట్టి ఆ సీటు డౌటే. ఇక గుంటూరు వెస్ట్, సత్తెనపల్లి సీట్లలో ఏదొక సీటు దక్కే ఛాన్స్ ఉంది. చూడాలి కన్నాకు ఏ సీటు ఇస్తారో.

Share post:

Latest