పెళ్లయినా తగ్గని ఆశ.. అది పెంచాలంటూ డిమాండ్ చేస్తున్న కాజల్!

సాధారణంగా పెళ్లయిన తర్వాత హీరోయిన్లు అవకాశాలు వస్తే సరిపోతుంది అనుకుంటారు. పెళ్లి కాకముందే రెమ్యునరేషన్ వీలైనంత ఎక్కువగా పెంచాలనుకుంటారు. అయితే టాలీవుడ్ అగ్రతార కాజల్‌కి మాత్రం పెళ్లయిన తర్వాత కూడా ఆశ ఏమాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. మొదటిలో లాగా ఆమె బాగా ప్రాధాన్యం ఉన్న రోల్స్ లో నటించడం లేదు కానీ ఇప్పుడు రెమ్యునరేషన్‌ను చాలా ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేస్తోంది. పెళ్లికి ముందు రూ.2 కోట్ల వరకు పారితోషికం పుచ్చుకున్న ముద్దుగుమ్మ ఇప్పుడు రూ.3 కోట్లకు పెంచాలని ప్రొడ్యూసర్స్‌ని డిమాండ్ చేస్తోందట. దాంతో ఆశ్చర్య పోవడం నిర్మాతల వంతు అవుతుందని టాక్ నడుస్తోంది.

ఈ అందాల తార ప్రస్తుతం కరుంగాపియం, ఘోస్టీ, ఉమా అనే సినిమాతో పాటు ఇండియన్ 2లో నటిస్తోంది. ఒక తెలుగు సినిమాలో బాలకృష్ణ సరసన కూడా ఈ క్యూట్ యాక్ట్రెస్ నటించనుందని సమాచారం. మొత్తంగా చూసుకుంటే కాజల్ కుర్ర హీరోయిన్లతో పోటీగా చాలానే సినిమాలను తన లైన్‌లో పెట్టింది. ఇకపోతే కాజల్ అగర్వాల్ 16 ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాణిలా కొనసాగింది. ఆర్య 2, మగధీర, డార్లింగ్, మిస్టర్ ఫర్ఫెక్ట్, సీతా వంటి సినిమాలతో తనదైన మార్క్ వేసుకుంది. బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్‌లతో నటించి మెప్పించింది. తమిళ్ సినిమా ఇండస్ట్రీలోనూ బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంది.

మరి పెళ్ళై తల్లి కూడా అయిన కాజల్‌కు మూడు కోట్లు ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు వస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Share post:

Latest