షాకింగ్ లుక్‌లో కాజల్ అగర్వాల్.. వీడియో చూస్తే స్టన్ అవుతారు..!!

టాలీవుడ్ అగ్రతార కాజల్ అగర్వాల్ తన ముచ్చటైన హావభావాలతో ఎంతోమందిని వెండితెరకు కట్టే పడేస్తుంది. ఈ ముద్దుగుమ్మకు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాదిమంది అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మిత్రవిందాగా, గీతాగా నటించి తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేసిన ఈ భామ రీసెంట్‌గా పెళ్లి చేసుకొని చాలామందిని నిరాశకు గురి చేసింది. ఇటీవల ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది దాంతో ఈ ముద్దుగుమ్మ సినిమాలుకు దూరం అయిపోతుందేమోనని అభిమానులు బాగా ఫీల్ అవుతున్నారు.

అయితే ఈ ముద్దుగుమ్మ పెళ్లికి ముందు చేయడానికి అంగీకరించిన కొన్ని సినిమాలు ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఖుషి చేస్తున్నాయి. ఇటీవలే నటించిన “ఘోస్టి” అనే హారర్ కామెడీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఇప్పుడు ఆమె “కరుంగాపియం” అనే మరో హారర్ అభిమానులలో హైప్ పెంచుతోంది. ఈ సినిమాలో కాజల్‌తో పాటు రెజీనా కసాండ్రా, జననీ అయ్యర్, రైజా విల్సన్, యోగి బాబు, సతీష్ కూడా నటించారు.

“కరుంగాపియం” ట్రైలర్‌ కొద్ది గంటల క్రితమే రిలీజ్ అయింది దీనిలో కాజల్ లుక్ చూసి చాలామంది షాక్ అవుతున్నారు. ఈ ట్రైలర్ ఓపెన్ చేయగానే ఒక ఓల్డ్ పుస్తకం తెరవగానే దుష్ట ఆత్మ మానవ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు కనిపించింది. ఫ్లాష్‌బ్యాక్‌లో కీలక పాత్రలో కనిపించిన కాజల్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు రెజీనాతో కలిసి ఆ పుస్తకం చదువుతున్నట్లు ట్రైలర్‌లో గమనించవచ్చు. ఈ సినిమాలో ఐదుగురు వ్యక్తుల జీవితాలు ఎలా కలిసాయో చూపించనున్నారట.

టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి తన సోషల్ మీడియా పేజీలో ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఇరాన్‌కి చెందిన నోయిరికా అనే ఐదవ నటి కూడా ఉంది. ట్రైలర్‌లో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం కాజల్ పాత్ర. ఆమెను ఎవరో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. ప్రతీకారం తీర్చుకోవడానికి దుష్ట ఆత్మగా తిరిగి వస్తుంది. ఆమె దుష్ట ఆత్మగా కనిపించడం చాలా భయానకంగా ఉంది. ఆ లుక్ లో కాజల్‌ను చూసి చాలామంది స్టన్ అవుతున్నారు.