తల్లి పై ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన జాన్వీ కపూర్..!!

దివంగత నటి శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్ తన తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ ధడక్ అనే చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రాన్ని కరన్ జోహార్ నిర్మించారు. అయితే మొదటి సినిమాతోనే గుర్తింపు సంపాదించుకోలేక పోయింది. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ కోసం ఘోస్ట్ స్టోరీస్ అనే వెబ్ డ్రామాలో నటించింది.. ఆ తర్వాత కరణ్ జోహార్ నిర్మించిన గంజన్ సక్సెస్ అయిన ది కార్గిల్ కాల్ తో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే తల్లి శ్రీదేవి తరహాలో మాత్రం హీరోయిన్ గా మ్యాజిక్ చేయలేకపోతోంది ఈ ముద్దుగుమ్మ.

Janhvi Kapoor looks for late mother Sridevi everywhere; Mili actress pens  an emotional note ahead of her death anniversary

ఐదు సినిమాలలో ఓ వెబ్ సిరీస్ లో నటించిన జాన్వీ బిగ్ స్టార్ తో కలిసి నటించే అవకాశం మాత్రం బాలీవుడ్ లో ఇప్పటివరకు అందుకోలేక పోతోంది. గత కొంతకాలంగా టాలీవుడ్ ఎంట్రీ పైన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న 30 వ సినిమా కోసం ఈమెను ఎంచుకోబోతున్నారని నిర్మాతలకు కండిషన్స్ చెప్పిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమా వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.

ఇదంతా ఇలా ఉండగా శ్రీదేవి డెత్ యూనివర్సల్ సందర్భంగా ఆమెను తలచుకుంటూ.. జాన్వీ సోషల్ మీడియాలో ఒక పోస్టును షేర్ చేయడం జరిగింది. నేను ఇప్పటికీ ప్రతిచోట నిన్నే వెతుకుతున్నాను అమ్మ ఇప్పటికీ నేను చేసే ప్రతి పనిని నేను నిన్ను గర్వించేలా చేస్తున్నానని ఆశిస్తున్నాను.. నేను ఎక్కడికి వెళ్లినా నేను చేసే ప్రతి పని కూడా మీతోనే మొదలవుతుంది నీతోనే ముగుస్తుంది అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఇన్స్టాల్ వేదికగా శ్రీదేవితో కలిసి ఉన్న ఒక ఫోటోని పంచుకుంటూ జాన్వీ ఈ పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Share post:

Latest