నాన్న చ‌నిపోయిన‌ప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా.. జబర్దస్త్‌ పవిత్ర షాకింగ్ కామెంట్స్‌!

నాన్న చ‌నిపోయిన‌ప్పుడు చాలా హ్యాపీగా ఫిల‌య్యా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది జబర్దస్త్‌ పవిత్ర. జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు సంపాదించుకున్న ఫిమేల్ కమెడియన్స్ లో ఈమె ఒక‌రు. అలాగే `పాగ‌ల్ ప‌విత్ర‌` పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి తెలుగు రాష్ట్రాల్లో మ‌రింత పాపుల‌ర్ అయింది. ప్ర‌స్తుతం ఈ అమ్ముడు ఓవైపు టీవీ షోస్ చేస్తూనే.. మ‌రోవైపు ప‌లు సీరియ‌ల్స్ లోనూ న‌టిస్తోంది.

అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ప‌విత్ర‌.. జీవితంలో తాను ప‌డిన క‌ష్టాల గురించి వివ‌రించింది. ప‌విత్ర తండ్రి లారీ డ్రైవర్. అమ్మ పొలం పనులకు వెళ్లేది. ఇద్దరూ పని చేస్తే కానీ పూట గడవని ప‌రిస్థితి. దీనికి తోడు ప‌విత్ర తండ్రి తాగుడుకు బానిసయ్యాడు. ప‌విత్ర‌ను, ఆమె త‌ల్లిని గాలికొదిలేశాడు. పిన్ని సాయంతో ఇంటర్‌ వరకు చదువుకున్న ప‌విత్ర‌.. ఆ త‌ర్వాత ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా చదువుకు గుడ్‌ బై చెప్పింది.

హైదరాబాద్‌కు వచ్చి సెలూన్‌ పార్లర్‌ పెట్టుకుంది. అప్పుడే అనుకోకుండా జబర్దస్త్‌లో అవకాశం రావ‌డంతో సెలూన్‌ అమ్మేసి ఆ డబ్బుతో సొంతూరులో సొంత ఇల్లు కొనుకుంద‌ట‌. అయితే తాగుడు కారణంగా తాను నాన్నతో 13 ఏళ్లు మాట్లాడలేద‌ని, ఆయన ముఖం చూడడానికి కూడా ఇష్టపడేదాన్ని కాద‌ని. ఏడాది క్రితం ఆయన చనిపోయారు. ఆక్షణం నేను ఎంతో సంతోషంగా ఫీలయ్యాన‌ని ప‌విత్ర ఎమోష‌న‌ల్ అయింది. ఏ కూతురు కన్న తండ్రి గురించి ఇలా మాట్లాడదు. కానీ, ప‌విత్ర మాట్లాడిందంటే ఆమె తండ్రి ఎంత క‌ష్ట‌పెట్టేడో అర్థం చేసుకోవ‌చ్చు అంటూ నెటిజ‌న్లు సానుభూతి వ్య‌క్తం చేస్తున్నారు.