క్లీన్‌స్వీప్‌పై కాన్ఫిడెన్స్..వైసీపీకి ఛాన్స్ ఏ జిల్లాలో?

వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలుచుకుని అసలు రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేస్తామని జగన్ తో సహ వైసీపీ కీలక నేతలు పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. అంటే ఇప్పుడు తమ పాలనపై అంత నమ్మకంగా ఉన్నారని చెప్పవచ్చు. తాము మంచి పాలన అందిస్తున్నామని, కాబట్టి ప్రజలంతా తమవైపే ఉంటారని జగన్ భావిస్తున్నారు. సరే ఆ కాన్ఫిడెన్స్ ఉండటంతో తప్పు లేదు.

కానీ ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ అన్నీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందా? అంటే అది సాధ్యం కాని టార్గెట్ అని చెప్పవచ్చు. అసలు ప్రజస్వామ్యంలో ప్రజలు ఎప్పుడు కూడా వన్ సైడ్ గా పూర్తి స్థాయిలో గెలిపించడం జరగని పని..అయితే పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో 90 శాతం వైసీపీ గెలిచిందంటే..దానికి కారణాలు ఏంటో అందరికీ తెలుసు. వైసీపీ ఎలా గెలిచిందో తెలుసు. ఆ విజయాలని బట్టి అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలుచేస్తామనేది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. ఎట్టి పరిస్తితుల్లోనూ ఇది జరగని పని.

పోనీ మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పడం అనేది కాన్ఫిడెన్స్..కానీ175 అనేది ఓవర్ కాన్ఫిడెన్స్. అయితే వైసీపీకి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయా? అంటే అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఒకవేళ టి‌డి‌పి-జనసేన కలిసి బరిలో ఉంటే వైసీపీ గట్టి పోటీ ఎదురుకోవాలి. అలాగే గత ఎన్నికల్లో నాలుగు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది..కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో స్వీప్ చేసింది.

ఈ సారి ఎన్నికల్లో ఒక్క జిల్లాలో స్వీప్ చేసిన గొప్పే అనే చెప్పాలి. ఈ సారి ఎన్నికల్లో వైసీపీ ఏ జిల్లాలోనూ స్వీప్ చేసేలా కనిపించడం లేదు. కాబట్టి స్వీప్ అనేది కష్టమనే చెప్పాలి.

Share post:

Latest