నందమూరి కుటుంబంలో వరుస మరణాలకి కారణం ఇదేనా.. ఆ శాపమే తగిలిందా..!

నందమూరి కుటుంబంలో జరుగుతున్న ఈ వరుస విషాదలకు అంతులేకుండా పోయింది. దీంతో ఇప్పుడు ఈ కుటుంబానికి ఏదైనా దోషం ఉందా.. ఏదైనా శాపం తగిలిందా.. అంటూ చాలామంది ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతూ వస్తున్నారు. అయితే నందమూరి కుటుంబంలో ఇప్పుడే కాదు సీనియర్ ఎన్టీఆర్ ఉన్న సమయం నుంచి ఈ కుటుంబంలో ఈ అనుకొని మరణాలు వస్తూనే ఉన్నాయి. ఈ కుటుంబంలో ఈ అనుకోని మరణాలు వస్తూనే ఉన్నాయి.

Nandamuri family tragedies, యాక్సిడెంట్లు, ఆకస్మిక మరణాలు.. నందమూరి  కుటుంబాన్ని వెంటాడిన విషాదాలు - ntr to taraka ratna: nandamuri family  members accident and unfortunate deaths - Samayam Telugu

సీనియర్ ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య హఠాత్తుగా రోడ్డు ప్రమాదంలో మరణించారు. అదేవిధంగా సీనియర్ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమ రావు కూడా ఒక రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారు.అయితే ఎన్టీఆర్ సోదరుడు అప్పుడప్పుడే పరిశ్రమలోకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే చనిపోయారు. అంతేకాకుండా త్రివిక్రమరావు చిన్న కొడుకు హరిణ్ కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారు. ఇక ఆయన పెద్ద కొడుకు కళ్యాణ్ చక్రవర్తి కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించడం గమనార్హం.

Nandamuri Family: నందమూరి కుటుంబానికి ఏమైనా శాపం ఉందా?

సీనియర్ ఎన్టీఆర్ కుటుంబం నుంచి హరికృష్ణ ఆయన పెద్ద కొడుకు జానకిరామ్ ఈ ఇద్దరు రోడ్డు ప్రమాదంలోనే మరణించారు. అలాగే గత సంవత్సరం సీనియర్ ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి కూడా అనుమానాస్పదస్థితిలో ఉరివేసుకొని మరణించారు. అంతేకాకుండా గతంలో 2009 ఎలక్షన్ల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలయ్యారు. తర్వాత మెరుగైన వైద్యం అందించడం ద్వారా ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇక ఇప్పుడు నందమూరి తారకరత్న, నారా లోకేష్ మొదలుపెట్టిన పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురై 23 రోజులు ప్రాణాలతో పోరాడి గత శనివారం మరణించారు.

అదే సమయంలో తారకరత్న హాస్పిటల్ లో చేరిన కొన్ని రోజులకే సీనియర్ ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ సోదరుడు రామకృష్ణ కూడా రోడ్డు ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక ఎప్పుడూ గత కొన్ని సంవత్సరాలుగా నందమూరి కుటుంబంలో ఇన్ని మరణాలు సంభవించాయి. అంతేకాకుండా ఈ మరణాలన్నీ అనుకోకుండా రావటం వల్ల ఇప్పుడు నందమూరి అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఏంటి ఇప్పుడు నందమూరి కుటుంబానికి ఏమైనా శాపం తగిలిందా.. ఎందుకు ఈ ఫ్యామిలీలోనే ఇలా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయని బాధపడుతున్నారు.