జబర్దస్త్ నుంచి పోసాని తప్పుకోవడానికి కారణం అదేనా..?

జబర్దస్త్ ప్రారంభం సమయంలో జడ్జిలుగా నాగబాబు, రోజా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కొన్ని కారణాల చేత నాగబాబు తప్పుకోవడం జరిగింది. దీంతో సింగర్ మనో ఎంట్రీ ఇచ్చారు. మనో కూడా కొన్ని కారణాల చేత ఈ షో మధ్యలో తప్పుకోవడం జరిగింది. దీంతో పోసాని మరియు కృష్ణ భగవానులను తీసుకురావడం జరిగింది.ఈ మధ్యకాలంలో పోసాని అసలు బుల్లితెర పైన కనిపించలేదు. అన్నిచోట్ల కూడా కృష్ణ భగవాన్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు దీంతో పోసానిని మల్లె మాల వారే పక్కన పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అదంతా రోజా చలవే.. జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్ల ఎంట్రీ.. | ysrcp leaders  entry into jabardasth comedy show because of roja– News18 Telugu
సినిమాలలో బిజీగా ఉన్న పోసాని ప్రతి ఎపిసోడ్ కూడా రెమ్యునరేషన్ భారీగానే డిమాండ్ చేస్తున్నారట. ఇక అంతే కాకుండా రేటింగ్ కూడా పెద్దగా రాలేదని ఉద్దేశంతో జబర్దస్త్ టీమ్ పోసనిని పక్కన పెట్టినట్లు బుల్లితెరవర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. పోసాని వేసే కామెడీ పంచులు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది కానీ పోసాని తొలగించడం ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది జబర్దస్త్ అభిమానులు చాలా అసంతృప్తితో ఉన్నారు. పోసానికి మరొక నటుడు కృష్ణ భగవాన్ తోడయ్యారు అంటే కచ్చితంగా అషో సక్సెస్ అవుతుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

కొంతమంది మాత్రం పోసాని ఓవరాక్షన్ చేస్తున్నారని అందుకే ఆయనను తొలగించారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి జబర్దస్త్ నుంచి పోసాని తప్పుకున్నారు లేకపోతే టిఆర్పి రేటింగ్ తగ్గడం వల్ల మల్లెమాలవారే పక్కన పెట్టారా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఇంద్రజ మరియు కృష్ణ భగవాన్ మాత్రమే జబర్దస్త్ తదితర కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.

Share post:

Latest