ఆనం ఫ్యామిలీ ఎఫెక్ట్..ఆ సీట్లు టీడీపీకి దక్కేనా?

ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాల కాలం నుంచి ఆనం ఫ్యామిలీ నెల్లూరు రాజకీయాలని శాసిస్తోంది. మొదట టి‌డి‌పిలో ఆ తర్వాత కాంగ్రెస్ లో మళ్ళీ టి‌డి‌పిలోకి, ఇప్పుడు వైసీపీలో ఉంది. కానీ వైసీపీకి దూరమవుతున్న విషయం తెల్సిందే. ఆనం ఫ్యామిలీలో సీనియర్ గా ఉన్న ఆనం రామ్ నారాయణ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇక ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన వైసీపీకి దూరమైన విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో సొంత ప్రభుత్వంపైనే ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు. కేవలం పథకాలు ఇస్తే ఓట్లు రాలవని, అభివృద్ధి చేయాలని చెబుతున్నారు…ఇక ముందస్తు ఎన్నికలకు వెళితే ముందుగానే ఇంటికొచ్చేస్తామని కామెంట్ చేశారు. దీంతో వైసీపీ అధిష్టానం సీరియస్ అయ్యి..ఆనంని వెంకటగిరి బాధ్యతల నుంచి తప్పించి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఇంచార్జ్ గా పెట్టింది. దీంతో ఆనం వైసీపీకి దూరమైనట్లు అయింది.

అయితే ఆనం టి‌డి‌పిలో చేరతారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇంకా ఆయన పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకోలేదు..కానీ ఎన్నికల ముందు టి‌డి‌పిలోకే వస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఆనం కుమార్తె కైవల్య రెడ్డి..టి‌డి‌పిలో చేరారు. ఆమె ఆత్మకూరులో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ఆనం సైతం టి‌డి‌పిలోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో జిల్లాలో కొన్ని సీట్లలో టి‌డి‌పికి కలిసొచ్చే అవకాశం ఉంది.

ఆనంకు వెంకటగిరితో పాటు ఆత్మకూరు, నెల్లూరు సిటీ స్థానాలపై పట్టు ఉంది. ఈ స్థానాల్లో టి‌డి‌పికి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆనం నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఆనం వల్ల టి‌డి‌పికి ఏ మేర ప్లస్ అవుతుంది.