బీజేపీ నుంచి పురందేశ్వరి అవుట్..జీవీఎల్ స్కెచ్?

ఏపీ బీజేపీలో కొందరు నేతల తిరుగుబాటుతో కల్లోలం నడుస్తోంది. ఊహించని విధంగా నేతల మధ్య మాటల యుద్ధంతో ఏపీ బీజేపీలో చిచ్చు చెలరేగింది. సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి బీజేపీలో వర్గ పోరు మొదలైందనే చెప్పాలి. అయితే ఇంతకాలం సైలెంట్ గా ఉన్న నేతలు ఇప్పుడు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. సోము వీర్రాజు, జి‌వి‌ఎల్ నరసింహారావు లాంటి వారు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అలాగే వైసీపీకి వ్యతిరేకంగా గళం విప్పే నేతలని నిదానంగా సైడ్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ఓవీ రమణ లాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక అధ్యక్షుడు ఉన్నప్పుడు కన్నా లక్ష్మీనారాయణ..పార్టీలో నియమించిన నేతలని సోము వరుస పెట్టి తప్పించుకుంటూ వచ్చారు. అటు సోము వైఖరి నచ్చక రావెల కిషోర్ బాబు లాంటి వారు పార్టీని వీడారు. ఇక తాజాగా కన్నా సైతం బి‌జే‌పికి గుడ్ బై చెప్పారు. సోము, జి‌వి‌ఎల్ లాంటి నేతల వైఖరి నచ్చక ఆయన పార్టీని వీడనని చెప్పారు.

తాజాగా పురందేశ్వరి గురించి చర్చ మొదలైంది. తాజాగా జి‌వి‌ఎల్..రాష్ట్రంలో వారిద్దరి పేర్లే ఉండాలా.వంగవీటి రంగా పేరు జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేశారు. వారిద్దరి పేర్లు అని ఎన్టీఆర్, వైఎస్సార్‌లని ఉద్దేశించి అన్నారు. దీంతో పురందేశ్వరి…జి‌వి‌ఎల్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆ ఇద్దరు కాదు..ఆ మహానుభావులు అని..వారు చేసిన గొప్ప కార్యక్రమాలని ఆమె చెప్పుకొచ్చారు.

ఇలా జి‌వి‌ఎల్‌కు పురందేశ్వరి కౌంటర్ ఇవ్వడంతో…బి‌జే‌పిలో సరికొత్త చర్చ మొదలైంది. ఇక పురందేశ్వరి సైతం బి‌జే‌పి నుంచి బయటకొచ్చేస్తారని ప్రచారం మొదలైంది. విశాఖ ఎంపీ సీటు కోసం జి‌వి‌ఎల్ మొదట నుంచి పురందేశ్వరిని సైడ్ చేయాలని చూస్తున్నారట. అయితే ఇప్పుడు జి‌వి‌ఎల్‌కు పురందేశ్వరి ఇలా కౌంటర్ ఇచ్చారు. మరి చూడాలి పురందేశ్వరి కూడా బి‌జే‌పికి గుడ్ బై చెబుతారేమో.

Share post:

Latest