పవన్ నటిస్తున్న ఆ చిత్రంలో ఆలీ నటిస్తున్నారా..?

పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. పవన్ సినిమా అంటే ఆలీ ఖచ్చితంగా గతంలో కనిపిస్తూ ఉండేవారు. అయితే ఇదంతా ఒకప్పుడు గత కొంతకాలంగా ఆలీకి పవన్ కళ్యాణ్ మధ్య వైరం వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చివరిగా కాటమరాయుడు సినిమాలో నటించారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ నటించిన ఏ చిత్రంలో కూడా కనిపించలేదు. ఆ సినిమా తర్వాతే నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం మరొక మూడు సినిమాలలో నటిస్తున్న పవన్ ఆలి ఏ చిత్రంలో కూడా నటించలేదట.

All Is Well Between Pawan Kalyan And Ali
అయితే ఇప్పుడు తాజాగా ఈ కాంబినేషన్ ని మరొకసారి డైరెక్టర్ హరీష్ శంకర్ సెట్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆలీ కూడా ఒక కీలకమైన పాత్రలు నటించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా హరి శంకర్ దర్శకత్వం వహించిన గబ్బర్ సింగ్ సినిమాలో ఆలీ నటించారు. అందుకే ఆలీ పవన్ కళ్యాణ్ సన్నివేశాలు బాగా పండాయి అని చెప్పవచ్చు.

Ali Calls Pawan Kalyan Cheap And Immature - Telugu Rajyam
దీంతో వీరిద్దరి మధ్య సన్నివేశాలను ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో కూడా వీలలు వేయించే విధంగా ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఇందులో నిజం ఎంత ఉన్నది అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలోనే ఆలీ నటించకపోవడానికి కారణాలు అనేకం అని చెప్పవచ్చు. ప్రస్తుతం పవన్, ఆలీ పలు రకాల రాజకీయ కారణాల చేత దూరంగా ఉన్నట్లు సమాచారం మరి వీరిద్దరూ కలిసి ఓకే ఫ్రేమ్లో కనపడితే చూడాలని అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు.

Share post:

Latest