వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్..జంపింగ్ అప్పుడేనా?

అధికార వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇవ్వనున్నారా? సొంత పార్టీపైనే మరో ఎమ్మెల్యేకు అసంతృప్తి ఉందా? నెక్స్ట్ సీటు దక్కదని తెలియడంతోనే ఆ ఎమ్మెల్యే పార్టీకి దూరం జరుగుతున్నారా? అంటే దర్శిలో జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తే అవుననే అనిపిస్తుంది. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గత కొంతకాలంగా వైసీపీలో యాక్టివ్ గా ఉన్నట్లు కనిపించట్లేదు. ఏదో మొక్కుబడిగానే కార్యక్రమాలు చేయడం తప్ప..గడపగడపకు తిరగడం లేదని తెలిసింది.

నెక్స్ట్ ఎన్నికల్లో సీటుపై గ్యారెంటీ లేకపోవడంతోనే మద్దిశెట్టి వైసీపీకి దూరం అయ్యేలా ఉన్నారని తెలుస్తోంది.ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి లాంటి సీనియర్ ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. ఇక పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం..దర్శి ఇంచార్జ్ గా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని నియమించడంతో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. పైగా గత వైసీపీ ప్లీనరీ సమావేశంలోనే ఈయన..జగన్‌పై హాట్ కామెంట్స్ చేశారు. పథకాలకు బటన్ నోక్కెది జగన్ అయినప్పుడు ఆయన గ్రాఫ్ పెరుగుతుంది గాని..ఎమ్మెల్యేల గ్రాఫ్ ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు.

ఆ పరిణామాల్లో దర్శిలో ఆధిపత్య పోరు పెరిగింది. బూచేపల్లి, మద్దిశెట్టి వర్గాల మధ్య రచ్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే బూచేపల్లిని ఇంచార్జ్ గా పెట్టారు. దీంతో మద్దిశెట్టికి నెక్స్ట్ సీటు లేదని తేలిపోయింది. దీంతో మద్దిశెట్టి గడపగడపకు తిరగడం తగ్గించేశారని తెలిసింది. అలాగే వైసీపీ వర్క్ షాపుల్లో కూడా మద్దిశెట్టి పాల్గొనడం లేదు. ఇటీవల జరిగిన వర్క్ షాపులో సైతం మద్దిశెట్టి పాల్గొనలేదు. దీని బట్టి చూస్తే మద్దిశెట్టి వైసీపీకి దూరం జరుగుతున్నారని అర్ధం అవుతుంది. మరి ఆయన టి‌డి‌పి లేదా జనసేనలోకి వెళ్తారనే ప్రచారం వస్తుంది.