ఫ్లాప్ హీరోయిన్స్ కి లైఫ్ ఇస్తున్న మామా అల్లుళ్ళు.. అస‌లు రీజ‌న్ తెలిస్తే షాకే!?

ప‌వ‌ర్ స్టార్ పవ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మెన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ సూప‌ర్ హిట్ `వినోద‌య సీతాం` రీమేక్ ఇది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి ప్ర‌ముఖ న‌టుడు సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా ప‌లు మార్పులు, చేర్పులు చేసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ప‌వ‌న్ దేవుడిగా క‌నిపించ‌బోతున్నాడు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అయితే ఈ సినిమాలో కేతిక శ‌ర్మ‌, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా ఎంపిక అయ్యారు.

వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న ఈ ఇద్ద‌రు హీరోయిన్ల‌కు మామా అల్లుళ్ళు లైఫ్ ఇస్తున్నార‌ని అంతా అనుకున్నారు. కానీ, అస‌లు రీజ‌న్ తెలిస్తే షాకైపోతారు. ఎందుకంటే బ‌డ్జెట్ త‌గ్గించుకోవ‌డ‌మే ఫ్లాపుల్లో ఉన్న ఈ హీరోయిన్ల‌ను తీసుకున్నార‌ట‌. బడ్జెట్ లో దాదాపు డ‌బ్బై శాతం పవన్ రెమ్యూనరేషన్ రూపంలోనే పోతుంది. అలాగే సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు గ‌ట్టిగానే ఇస్తున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలోనే లక్షల్లో తీసుకునే కేతిక శ‌ర్మ‌, ప్రియా ప్రకాష్ వారియర్ తో మూవీ పూర్తి చేద్దామని మేక‌ర్స్ డిసైడ్ అయిన‌ట్లు ఇన్‌సైడ్ టాక్‌.

Share post:

Latest