ఇలా అయితే సలార్ సీక్వెల్ కష్టమే..?

కేజిఎఫ్ వంటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించిన ప్రభాస్ ఆ తర్వాత మరే చిత్రంతో కూడా సక్సెస్ కాలేకపోతున్నారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ కూడా సలార్ సినిమాపైనే ఉన్నాయి. ఈ అంచనాలకు రీచ్ అయ్యేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతోపాటు రెండు భాగాలుగా తీయబోతున్నారని వార్తలు మొదటి నుంచి వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇటు ప్రశాంత్ నీల్ కానీ ,ప్రభాస్ కానీ అధికారికంగా ప్రకటించలేదు.

கேஜிஎஃப் 2' வசூலை 'சலார்' முறியடிக்கும்: தயாரிப்பாளர் நம்பிக்கை | Salar  will beat the collection of KGF 2 - hindutamil.inరెండు భాగాలుగా రావట్లేదని కూడా సమాధానాన్ని తెలపలేదు. ప్రశాంత్ నీల్ అడిగితే అటు కాకుండా ఇటు కాకుండా సమాధానం చెప్పి వెళ్ళిపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రెండు భాగాలను కాస్త మళ్లీ ఒక భాగమే చేయబోతున్నట్లు సమాచారం. సలార్ మూవీ ఎంత త్వరగా కంప్లీట్ అయితే అంత త్వరగా ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ తో మరొక సినిమాని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డిసెంబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేసుకున్న తారక్ ఈ సినిమాని పట్టాలెక్కించాల్సిందే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి సమయంలో సలార్ సినిమాను రెండు భాగాలుగా తీయడం అంటే అది అసాధ్యమని చెప్పవచ్చు. అతి తక్కువ సమయంలో రెండు భాగాలు తీయడం మొదటి పార్ట్ విడుదల చేసి దానిని ప్రచారంలో పాల్గొనడం వంటి వాటితోనే సరిపోతుంది. మరొకవైపు ప్రభాస్ కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆది పురుష్, రాజా డీలక్స్, స్పిరిట్, ప్రాజెక్ట్-k వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇక ఇలాంటి విజిల్స్ షెడ్యూల్ వల్ల కూడా అటు ప్రభాస్ ,ప్రశాంత్ నిల్ కేవలం ఒక్క భాగంగానే తెరకెక్కించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి అసలు విషయం పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.

Share post:

Latest