పై లోకంలో ఉన్న నందమూరి తారకరామారావు గారు సంతోషపడాలి అంటే..బాలయ్య ఆ పని చేయాల్సిందే..!?

స్వర్గీయ నందమూరి తారక రామారావు.. ఈ పేరు చెప్తే మనలో మనకే తెలియని స్పెషల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. మనకు తెలియకుండా గూస్ బంప్స్ వస్తాయి . మన బాడీలో మనకి తెలియకుండానే చేతులు పైకి లేసి దండం పెడతాయి . అంతలా తన పేరుకి ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకున్నాడు నందమూరి తారక రామారావు గారు . ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి కొడుకులు , మనవళ్లు వచ్చినా.. ఇప్పటికీ నందమూరి అనగానే తారక రామారావు గారి పేరే గుర్తు చేసుకునే జనాలు ఎంతో మంది ఉన్నారు .

కాగా కేవలం సినిమాల పరంగానే కాకుండా రాజకీయాల పరంగా కూడా సంచలన రికార్డులు నెలకొల్పిన తారక రామారావు గారు స్థాపించిన టిడిపి పార్టీ ప్రస్తుతం ఎలాంటి పొజిషన్లో ఉందో మనందరికీ తెలిసిందే . కాగా ఆయన కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య కూడా టిడిపిని పైకి తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నారు . ఇలాంటి క్రమంలోని నందమూరి ఫ్యాన్స్ బాలయ్యను కొత్త కోరిక కోరుతున్నారు . టిడిపి మళ్లీ పుంజుకోవాలి అన్నా.. నందమూరి తారక రామారావు గారు పై లోకం లో సంతోషపడాలి అన్నా.. బాలయ్య కూతురు బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావాలని ..కచ్చితంగా ఆమెకున్న టాలెంట్ కి సీఎం పదవి చేపడుతుందని ..అప్పుడు టిడిపి మళ్లీ పునర్ వైభవం అందుకుంటుంది అని జనాలు చెప్పుకొస్తున్నారు .

కేవలం టిడిపి శ్రేణులే కాదు ..సామాన్య జనాలు కూడా అదే కోరుకుంటున్నారు . ఆమెకున్న టాలెంట్ కి తెలివితేటలకి ఆమె సీఎం అయితే కచ్చితంగా ఏపీ బాగుపడుతుందని చెప్పుకొస్తున్నారు. అయితే బాలకృష్ణ కి మాత్రం కూతురిని రాజకీయాలోఖి దించడం ఇష్టం లేదట . అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చిన బ్రాహ్మణిని అటువైపుగా వెళ్ళనివ్వలేదు అంటూ తెలుస్తుంది. ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నారు. చూద్దాం మరి బాలయ్య ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..?

Share post:

Latest