అమ్మ బాబోయ్..హీరోయిన్ నిత్యామీనన్.. ఇంత ముదుర..!

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో గ్లామ‌ర్ షోకు దూరం గా ఉండే అతి తక్కువ మంది హీరోయిలోన్లు నిత్యా మీనన్ ఒక‌రు. ప‌రిశ్ర‌మ‌లో ఉన్నాచాలా మంది హీరోయిన్లు రెండు, మూడు ఫ్లాప్‌లు పడగానే అవకాశాల కోసం ద‌ర్శ‌కులు ఏది చేపితే అది చేయ్య‌టానికి సై అంటారు. కానీ నిత్యామీనన్ అలాంటి హీరోయిన్ కాదు, కేవలం నటనకు ప్రాధాన్యత‌ ఉన్న పాత్రలే చేస్తుంది కానీ, అవకాశాల కోసం డైరెక్టర్ ఏది చెప్తే అది చేసేరకం మాత్రం కాదు. ఆమే సిని కేరీర్ మొత్తం చూస్తే మ‌న‌కి ఇదే అర్థం అవుతుంది.

ఈమె టాలీవుడ్‌లో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వ‌చ్చిన‌ ‘అలా మొదలైంది’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రి ఇచ్చింది. ఈ సినిమాకి ముందు కన్నడ మరియు మలయాళం భాషలకు కలిపి పది సినిమాల్లో నటించింది. అయితే నిత్యామీన‌న్‌ కేవలం హీరోయిన్ గా మాత్రమే చేసిందని అందరూ అనుకుంటూ ఉన్నారు, కానీ ఈమె హీరోయిన్ గా ఎంట్రి ఇవ్వ‌క‌ ముందే పలు సినిమాల్లో బాలనటిగా నటించింది, వాటిల్లో ముఖ్యంగా 1998 వ సంవత్సరం లో విడుదలైన ‘హనుమాన్’ అనే సినిమా లో నిత్యామీనన్ న‌టించింది. ఈ సినిమాలో ఈమె పాత్ర‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇది మన భార‌తీయా సినిమా కూడా కాదు హాలీవుడ్ మూవీ.

Nith

నిత్యామీనన్ కి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయాన, కానీ త‌న చ‌దువుకునే రోజుల నుంచి ఎంతో యాక్ట్‌వ్‌గా ఉండేది. స్కూల్ లో ఎటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసిన అందులో నిత్యా పస్ట్ వ‌చ్చేది. అది గమనించిన స్కూల్ యాజమాన్యం అప్పట్లో ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు.. ఫ్రెడెరిక్ తెరకెక్కిస్తున్న హనుమాన్ అనే సినిమా కోసం ఇండియా లో ఉన్న చిన్నారులను ఆడిషన్ చేస్తున్న విషయాన్నీ తెలుసుకొని త‌మ స్కూల్ నుంచి నిత్యా మీనన్ ఫోటోలను ‘ఫెడెరిక్’ కి పంపారట. ఆ తర్వాత వెంటనే నిత్యా మీనన్ ని ఆడిషన్ చేసి ఆ సినిమాలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇలా ఏ హీరోయిన్ అందుకోని అరుధైన ఘనత నిత్యామీనన్ త‌న చిన్న‌త‌నంలోనే అందుకుంది.

 

Share post:

Latest