ఆ అట్ట‌ర్ ఫ్లాప్ మూవీలో రాజ‌మౌళి న‌టించాడని మీకు తెలుసా?

ఎస్‌.ఎస్‌. రాజమౌళి అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. తెలుగు జాతి ఖ్యాతిని ఇంటర్నేషనల్ స్థాయిలో చాటి చెప్పిన ద‌ర్శ‌క‌ధీరుడు. టీవీ సీరియల్స్‌కు దర్శకుడిగా పనిచేసిన రాజమౌళి.. స్టూడెంట్ నెం.1 మూవీతో వెండితెర‌పైకి అడుగు పెట్టారు. తొలి సినిమాతోనే త‌న మార్క్ చూసిన ఆయ‌న‌.. అంచ‌లంచ‌ల‌గా ఎదుగుతూ డైరెక్ట‌ర్ గా తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.

రాజ‌మౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్‌` ప్ర‌స్తుతం ఆస్కార్ రేసులో దూసుకుపోతోంది. దీంతో సౌత్, నార్త్ స్టార్స్ మాత్ర‌మే కాదు హాలీవుడ్ తార‌లు కూడా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ప‌ని చేయాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. ఇక‌పోతే రాజ‌మౌళి ద‌ర్శ‌కుడిగానే కాకుండా న‌టుడిగానూ మెరిశారు. తారు తెర‌కెక్కించే ప్ర‌తి సినిమాలోనూ కొన్ని సెకండ్ల పాటు తెర‌పై క‌నిపిస్తుంటారు.

అయితే ఇప్పటివరకు ఓటమి ఎరుగని ఈ దర్శకధీరుడు ఓ ఫ్లాప్ చిత్రంలో నటించారన్నది మీకు తెలుసా..? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఈ సినిమా ఏంటంటే.. `రెయిన్‌బో`. 2008లో విఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రాహుల్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి, కోడి రామకృష్ణ చిన్న క్యామియో రోల్స్‌లో కనిపించారు. అయితే ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక బాక్సాఫీస్ వ‌ద్ద అట్ట‌ర్ ఫ్లాప్ గా నిలిచింది. ఆ త‌ర్వాత రాజ‌మౌళి త‌న సినిమాల్లో మిన‌హా.. మ‌రే మూవీలోనూ క‌నిపించ‌లేదు.

Share post:

Latest