ఎన్టీఆర్ తో గొడవ వల్ల 14 ఏళ్లు మాట్లాడని డైరెక్టర్..!!

లెజెండ్రీ డైరెక్టర్ కె విశ్వనాథ్ అనారోగ్య సమస్యతో ఈనెల రెండవ తేదీన మరణించిన సంగతి తెలిసింది. అయితే ఈయన మరణించిన తర్వాత ఎంతోమంది విశ్వనాధ్ గారితో ఉన్న అనుబంధాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా విశ్వనాథ్ గారికి సంబంధించి కొన్ని విషయాలు వెలుగులోకి రావడం జరిగింది ఈ క్రమంలోని విశ్వనాధ్ గారికి ఎన్టీఆర్కి మధ్య జరిగిన ఒక గొడవ కూడా వైరల్ గా మారుతోంది. వీరిద్దరి మధ్య దాదాపుగా 14 సంవత్సరాల పాటు మాటలు లేవన్నట్లుగా తెలుస్తున్నది. ఈ విధంగా ఎన్టీఆర్, విశ్వనాథ్ గారి మధ్య గొడవలకు కారణం ఏంటనే విషయం ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

ఎన్టీఆర్, కె.విశ్వనాథ్ కు విభేదాలు రావడానికి అసలు కారణం అదేనా! | Telugu  Rajyam

అసలు విషయంలోకి వెళ్తే కాలేజీ చదువుకునే రోజుల్లో ఎన్టీఆర్, విశ్వనాధ్ గారికి సీనియర్ అట అలా వీరిద్దరి మధ్య ఎంతో పరిచయం ఉన్నది.ఎన్టీఆర్ చదువు పూర్తి అయిన తర్వాత సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చారు. విశ్వనాధ్ గారు కూడా చదువు పూర్తి కాగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి పరిచయం ఏర్పడింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నాలుగోవ చిత్రం చిన్ననాటి స్నేహితులు ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్కు విశ్వనాథకు మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ సన్ గ్లాసెస్ పెట్టుకొని లోకేషన్ కు వచ్చారట. అయితే అది సెంటిమెంట్ సీన్ కావడంతో సన్ గ్లాసెస్ బాగుండవని విశ్వనాథ్ చెప్పినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం వినలేదట. ఈ సన్నివేశం షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయి ఆ సంఘటన విషయంలో ఎన్టీఆర్ విశ్వనాథ పైన చాలా ఆగ్రహాన్ని తెలియజేశారట. అయితే గతంలో కూడా ఒక సినిమాకి డైరెక్టర్ గా వ్యవహరించాల్సిన విశ్వనాథ్ గారిని కూడా తొలగించారట ఎన్టీఆర్ దీంతో వీరిద్దరి మధ్య 14 సంవత్సరాలు మాటలు లేవని తెలుస్తోంది.

Share post:

Latest