ఇందుమూలంగా.. ప‌వ‌న్‌పై ప‌డుతున్న మ‌ర‌క‌.. మ‌చ్చ అదేనా…?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌పై మ‌చ్చ‌లు..మ‌ర‌కలు రెండూ ప‌డుతున్నాయి. ఇవి ఉద్దేశ‌పూర్వ‌కంగా చేస్తున్న‌వా .. లేక ఆయ‌న‌ను డ్యామేజీ చేయాల‌నే ల‌క్ష్యంతో చేస్తున్న‌వా? అనేది ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టికే ఏపీలో ఉన్న వైసీపీ నాయ‌కులు ప‌వ‌న్ అంటే.. ప‌వ‌ర్ స్టార్ కాదు..ప్యాకేజీస్టార్ అనే ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌జ‌లు దీనిని విశ్వసించారా? లేదా.. ? అనేది ప‌క్క‌న‌పెడితే.. ఒక విష‌యం మాత్రం క్లారిటీ ఉంది.

ప‌వ‌న్ చేస్తున్న ప్ర‌చారం.. చెబుతున్న మాట‌ల‌ను ప‌రిశీలిస్తే.. ఈ మాట‌ల‌కు బ‌లం చేకూర్చేలా ఉన్నాయ నే చర్చ అయితే.. బ‌లంగానే వినిపిస్తోంది. ఇక‌, ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లోనూ ప‌వ‌న్‌ను డ్యామేజీ చేసేలా వ్యూహాలు రెడీ చేస్తున్నార‌ని అంటున్నారు. వ‌చ్చే తెలంగాణ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ 30 నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న పార్టీ నేత‌ల‌ను నిల‌బెట్టాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇది ఆయ‌న అలా చెప్పారో లేదో.. ఇలా.. వ్య‌తిరేక ప్ర‌చారం ప్రారంభ‌మైంది.

ప‌వ‌న్‌ను కేసీఆర్ కొనుగోలు చేస్తున్నార‌ని..ప్యాకేజీ కూడా రెడీ అయిపోయింద‌ని.. దాదాపు వెయ్యి కోట్ల రూపా య‌ల వ‌ర‌కు ప‌వ‌న్‌కు ముట్ట‌జెప్పేందుకు ముందుకు వ‌చ్చారంటూ.. వార్త‌లు వ‌చ్చాయి. అంటే..తెలంగాణ లోనూ.. ప‌వ‌న్‌ను ప్యాకేజీ నేత‌గా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నిజానికి రాజకీయాల్లో నాయ‌కుల‌ను కొనుగోలు చేయ‌డం స‌హ‌జ‌మే అయిన‌ప్ప‌టికీ.. ఏకంగా పార్టీల‌ను కొనేసే ప‌రిస్థితి ఇప్పుడు వ‌స్తే.. ఇంత‌క‌న్నా దారుణం ఉండ‌దు.

అది కూడా మార్పు కోరుతూ వ‌చ్చిన ప‌వ‌న్ వంటివారి విష‌యంలో ఇలాంటి వార్త‌లు రావ‌డం ద్వారా.. బ‌ల మైన ప్ర‌త్యామ్నాయానికి గొడ్డ‌లి పెట్టుగా మారుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాజ‌కీయాల్లో కొన్నికొ న్ని సార్లు మౌనం మంచిదే అయిన‌ప్ప‌టికీ.. ఇలాంటి సంద‌ర్భాల్లో కూడా ప‌వ‌న్ మౌనంగా ఉండ‌డం స‌రికాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఆయ‌న ఎప్పుడు.. ఎలా ? రియాక్ట్ అవుతారో చూడాలి.