ధనుష్ సూపర్ హిట్ `సార్`ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో ఎవ‌రో తెలుసా?

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ తెలుగులో డైరెక్ట్ గా చేసిన తొలి చిత్ర‌మే `సార్‌`. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో అందాల భామ సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. సముద్రఖని, తనికెళ్లభరణి, సాయికుమార్‌, నర్రా శ్రీనివాస్‌, హైపర్ ఆది ప్రధాన పాత్రల్లో నటించారు.

ఫిబ్ర‌వ‌రి 17న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను రాబడుతోంది. ముఖ్యంగా తెలుగులో ఈ చిత్రం మూడు రోజుల్లోనూ లాభాల బాట ప‌ట్టింది. విద్యా వ్యవస్థ తీరు తెన్నులపై సాగే కథాంశంతో సార్ మూవీని తెర‌కెక్కించారు. విద్యా వ్యవస్థలో ఉన్న అక్రమ వ్యాపారాలను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు.

సామాజిక స్పృహను కలిగించే అంశాలు కూడా ఇందులో మెండుగా ఉన్నాయి. దీంతో ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. ఇక‌పోతే సార్ మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ ధ‌నుష్ కాద‌ట‌. టాలీవుడ్ కు చెందిన ఓ హీరో ఈ సూప‌ర్ హిట్ మూవీని రిజెక్ట్ చేశాడ‌ట‌. ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు.. న్యాచుర‌ల్ స్టార్ నాని. వెంకీ అట్లూరి సార్ క‌థ‌ను మొద‌ట నానికి వినిపించాడ‌ట‌. అయితే క‌థ న‌చ్చిన‌ప్ప‌టికీ.. ఇంత‌ర ప్రాజెక్ట్స్ కార‌ణంగా ఆయ‌న ఈ సినిమాను సున్నితంగా రిజెక్ట్ చేశార‌ట‌. ఆ త‌ర్వాత ధ‌నుష్ వ‌ద్ద‌కు ఈ కథ వెళ్ల‌డం, సినిమా చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగాయి. క‌ట్ చేస్తే ఇప్పుడు సార్ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల ప‌రంగా దుమ్ము దులిపేస్తోంది.

Share post:

Latest