చిత్తూరుపై నో క్లారిటీ..కుప్పంపై ఆశలు!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టి‌డి‌పికి కొన్ని సీట్ల విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. కొన్ని చోట్ల ఇంచార్జ్‌లని ఇంకా డిసైడ్ చేయలేదు. అలా ఇంచార్జ్ లేని స్థానాల్లో చిత్తూరు అసెంబ్లీ కూడా ఒకటి. గత ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి ఏ‌ఎస్ మనోహర్ పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన పార్టీని వీడారు అప్పటినుంచి చిత్తూరు స్థానం ఖాళీగానే ఉంది. అక్కడ అభ్యర్ధి ఎవరు అనేది క్లారిటీ లేదు. కాకపోతే ఆ సీటు కోసం కొందరు నేతలు పోటీ పడుతున్నారు. కానీ చంద్రబాబు ఇంకా ఎవరికి సీటు ఫిక్స్ చేయలేదు.

ఇదే క్రమంలో నెక్స్ట్ పొత్తు ఉంటే ఈ సీటు జనసేనకు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే పొత్తు అంశం ఇప్పుడే క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఈ సీటులో ఇంచార్జ్‌ని పెట్టాలనే డిమాండ్ ఎక్కువగా వస్తుంది. బలం ఉన్న సీటుని అలా వదిలేస్తే ఎలా అని కార్యకర్తలు అంటున్నారు. అదే సమయంలో చిత్తూరు ఎంపీ సీటులో కూడా బలమైన నాయకుడుని నిలబెట్టాలని కోరుతున్నారు. మాజీ ఎంపీ శివప్రసాద్ చనిపోయిన దగ్గర నుంచి అక్కడ టి‌డి‌పి నాయకుడు లేరు.

2009, 2014 ఎన్నికల్లో చిత్తూరు ఎంపీగా శివప్రసాద్ గెలిచిన విషయం తేలిసిందే. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అనారోగ్యంతో శివప్రసాద్ చనిపోయారు. దీంతో ఆ సీటు ఖాళీగానే ఉంది. ఈ సీటు కోసం శివప్రసాద్ అల్లుడు నరసింహాప్రసాద్ ట్రై చేస్తున్నారు. కానీ ఆయన్ని రైల్వే కోడూరు ఇంచార్జ్ గా ఉంచారు.

అయితే చిత్తూరు ఎంపీ సీటు కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఎందుకంటే ఈ సీటుని కుప్పంలో వచ్చే మెజారిటీ బట్టి గెలుచుకోవచ్చు. గత ఎన్నికల్లో కుప్పంలో మెజారిటీ తక్కువ రావడం, ఇతర స్థానాల్లో వైసీపీకి భారీ మెజారిటీలు రావడంతో చిత్తూరు ఎంపీ సీటు వైసీపీ కైవసం చేసుకుంది. మరి ఈ సారి టి‌డి‌పి నుంచి ఎవరు పోటీలో ఉంటారో చూడాలి.