జగ్గంపేటలో బాబు జోరు..చంటిబాబుకు చెక్?

మళ్ళీ టీడీపీ అధినేత చంద్రబాబు ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అనూహ్యంగా రోడ్ షో చేశారు. కందుకూరు, గుంటూరు ప్రమాదాల తర్వాత బాబు కుప్పంకు వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే అక్కడ రోడ్ షో చేయకుండా పోలీసులు పలు ఆంక్షలు పెట్టారు. దీంతో బాబు కాలినడకనే కుప్పంలో తిరిగారు. ఈ క్రమంలోనే బాబు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. కానీ ఇక్కడ రోడ్ షోలకు పర్మిషన్ రావడంతో బాబు..జగ్గంపేట స్థానంలో రోడ్ షో నిర్వహించి..జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

జగన్ ప్రభుతంలో మొత్తం అవినీతి అనే…జగన్ హోల్ సేల్ దోపిడి చేస్తుంటే..కిందివాళ్లు రిటెయిల్ గా దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. అటు రాష్ట్రానికి రెండు కళ్ళు అయిన అమరావతి, పోలవరంని పొడిచేశారని అన్నారు. ఇక తనదైన శైలిలో బాబు..జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అయితే జగ్గంపేట రోడ్ షోలో జనం భారీగానే వచ్చారు. ఈ పరిణామాలు బట్టి చూస్తే జగ్గంపేటలో టి‌డి‌పికి కొత్త ఊపు కనిపిస్తుందని చెప్పవచ్చు.

గత ఎన్నికల్లో వైసీపీ నుంచి జగ్గంపేట నుంచి జ్యోతుల చంటిబాబు గెలిచిన విషయం తెలిసిందే. టి‌డి‌పి నుంచి జ్యోతుల నెహ్రూ పోటీ చేసి ఓడిపోయారు. అయితే నిదానంగా వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. ఇది కాస్త టి‌డి‌పి నేత జ్యోతులకు బెనిఫిట్ అవుతుడి. ప్రస్తుతానికి అక్కడ వైసీపీ-టి‌డి‌పిలు పోటాపోటిగా ఉన్నాయి.

ఎన్నికల సమయంలో రాజకీయ పరిస్తితి మారే ఛాన్స్ కూడా ఉంది. పైగా టి‌డి‌పితో జనసేన పొత్తు పెట్టుకుంటే జగ్గంపేటలో పై చేయి సాధించే అవకాశం ఉంది. మొత్తానికి బాబు పర్యటనతో జగ్గంపేటలో టి‌డి‌పికి కాస్త ఊపు వచ్చిందనే చెప్పాలి.