బొజ్జల వారసుడుకు ఇంకా పట్టు దొరకలేదా?

ఉమ్మడి చిత్తూరు జిల్లా రెడ్డి సామాజికవర్గం ప్రభావం ఎక్కువ ఉంటుందనే విషయం తెలిసిందే. అలా రెడ్డి వర్గం ప్రభావం ఉన్నా సరే టి‌డి‌పి హవా నడిచే స్థానాల్లో శ్రీకాళహస్తి ఒకటి అని చెప్పవచ్చు. ఇక్కడ మొదట నుంచి టి‌డి‌పి హవా నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఆరుసార్లు గెలిచింది. 1983 నుంచి 2019 వరకు 9 సార్లు ఎన్నికలు జరిగితే టి‌డి‌పి 6 సార్లు గెలిచింది. అంటే కాళహస్తిలో టి‌డి‌పి బలం ఎలాంటిదో చెప్పాల్సిన పని లేదు. 1983లో ఇండిపెండెంట్, 2004లో కాంగ్రెస్ గెలవగా, 1985, 1989, 1994, 1999, 2009, 2014 ఎన్నికల్లో టి‌డి‌పి గెలిచింది. అందులో నాలుగుసార్లు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి టి‌డి‌పి నుంచి గెలిచారు.

2014లో ఆయన గెలిచి మంత్రి కూడా అయ్యారు. తర్వాత అనారోగ్య సమస్యల వల్ల పక్కకు తప్పుకున్నారు. దీంతో 2019 ఎన్నికల్లో బొజ్జల వారసుడు సుధీర్ రెడ్డి టి‌డి‌పి నుంచి పోటీ చేశారు. అటు వైసీపీ నుంచి బియ్యపు మధుసూదన్ రెడ్డి పోటీ చేశారు. భారీ మెజారిటీతో బియ్యపు గెలిచారు. అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో కాళహస్తిలో వైసీపీ హవా నడుస్తోంది. పైగా సుధీర్ రెడ్డి మొదట్లో యాక్టివ్ గా పనిచేయలేదు. దీని వల్ల టి‌డి‌పి వెనుకబడింది.

ఇటీవలే అక్కడ యాక్టివ్ గా పనిచేస్తున్నారు..పైగా లోకేష్ పాదయాత్ర జరిగింది. దీంతో కాళహస్తిలో టి‌డి‌పికి కాస్త ఊపు వచ్చింది. అటు వైసీపీ ఎమ్మెల్యేపై నెగిటివ్ కనిపిస్తుంది. ఈ పరిస్తితిని ఉపయోగించుకుంటే కాళహస్తిలో సుధీర్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ అనుకున్న మేర బలపడటంలో సుధీర్ విఫలమైనట్లు కనిపిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా 15 నెలల సమయం ఉంది కాబట్టి ఈలోపు బలపడితే కాళహస్తి టి‌డి‌పి సొంతమవుతుంది..లేదంటే కష్టమే.

Share post:

Latest